Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి కుమార్తెను క్లాస్ మేట్ ఏడిపించారట!
By: Tupaki Desk | 22 Jun 2019 10:34 AM GMTఆమె స్వయాన కేంద్రమంత్రి. కానీ.. సగటు అమ్మ మాదిరే ఆమె వ్యవహరించారు. తన కుమార్తె ఒత్తిడికి తలొగ్గి తాను పోస్ట్ చేసిన ఫోటోను డిలీట్ చేశారు. తన పనిని సమర్థించుకున్న ఆమె.. తన కుమార్తె గురించి గొప్పగా చెప్పకొచ్చారు. వైరల్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. తన కుమార్తెతో సరదాగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. అయితే.. ఆ పోటోను చూసిన ఆమె క్లాస్ లోని ఒక ఇడియట్ ఆమెను ఎగతాళి చేశాడట. ఫోటోలో ఆమె ఫన్నీగా చూస్తున్న తీరుపై వేళాకోళం ఆడాడట. అంతేకాదు.. ఫోటోలో ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలంటూ తోటి విద్యార్థుల్ని కూడా రెచ్చగొట్టాడట. దీంతో.. ఆ ఫోటోను చూపిస్తూ ఏడిపిస్తున్నారని.. దాన్ని డిలీట్ చేయాలని తన కుమార్తె కోరటంతో స్మృతి లాంటి ఫైర్ బ్రాండ్ సైతం వెనక్కి తగ్గారు. తన కుమార్తె మాట కాదనలేక.. ఆ ఫోటోను డిలీట్ చేశారు. అదే విషయాన్ని ఆమె పేర్కొన్నారు.
తన కూతురు కంటతడి పెట్టటం ఇష్టం లేకనే తాను ఫోటోను డిలీట్ చేయటానికి ఇష్టపడ్డానని చెప్పిన ఆమె.. తన జోలికి వచ్చిన వాళ్ల సంగతి తన కుమార్తె చూసుకోగలదని హెచ్చరించారు. తాను తన కమార్తెకు తల్లినైనందుకు గర్విస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే పోస్టులో తన కమార్తె సాధించిన ఘన విజయాల గురించి వివరంగా చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఫోటోను తాను డిలీట్ చేయటం ద్వారా సదరు ఆకతాయికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని తనకుఅనిపించిందని.. కాకుంటే కూతురి మాట కోసం డిలీట్ చేశానన్నారు. అయితే.. సదరు ఆకతాయికి ఆమె వార్నింగ్ ఇచ్చారు.
తన కుమార్తె మంచి క్రీడాకారిణినని.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించిందని చెప్పిన స్మృతి.. కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించిందని.. వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలుచుకుందన్నారు. తన కుమార్తె చాలా మంచిదని.. చాలా అందంగా ఉంటుందని.. మీరు ఎంత ఏడిపించినా తిరిగి పోరాటం చేయగలదన్న ఆమె.. తెలివైన తనకుమార్తెకు తల్లినైనందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ విషయాల్ని సదరు అకతాయి అర్థం చేసుకొని బుద్ది తెచ్చుకునే అవకాశం ఉందా?