Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై పార్లమెంటులో వాపోయిన స్మృతి
By: Tupaki Desk | 24 Feb 2016 4:20 PM GMTఅందుబాటులో ఉన్నట్లే వ్యవహరిస్తూ.. అందకుండా ఉండటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమన్న విషయం దేశ వ్యాప్తంగా అర్థమైనట్లే. ఇప్పటివరకూ కేసీఆర్ విలక్షణ వైఖరి చాలా పరిమితంగానే తెలుసు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు దేశ వ్యాప్తంగా తెలిసింది చాలా తక్కువ. ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి పరపతి ఉన్నా.. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ సూసైడ్ ఇష్యూలో ఆయన అనుసరించిన వైఖరిపై జాతీయ స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కల్పించారు.
బుధవారం హెచ్ సీయూ విద్యార్థి రోహిత్.. ఢిల్లీ జేఎన్ యూ వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ సాగింది. హెచ్ సీయూ వ్యవహారం మీద కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వివరణ ఇస్తూ.. తానీ విషయం మీద వివరాలు కనుక్కునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.
యూనివర్సిటీల్లో శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని.. అయితే రోహిత్ అంశంపై తాను ఎన్నిసార్లు కేసీఆర్ కు ఫోన్ చేసినా ఆయన మాట్లాడలేదని.. ఆయన సిబ్బంది కేసీఆర్ బిజీగా ఉన్నట్లుగా చెప్పారన్నారు. కేసీఆర్ బిజీగా ఉన్నట్లు సిబ్బంది చెప్పటంతో తాను ఆయన కుమార్తె.. ఎంపీ కవితకు పలుమార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదని లోక్ సభలో ఆమె వెల్లడించారు.
రోహిత్ ఇష్యూ గురించి ఈ రోజు వరకూ కవిత తనతో మాట్లాడలేదంటూ స్మృతి వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుమార్తె సైతం అందుబాటులో ఉండకుండా ఎలా ఉండాలో బాగానే తెలుసుకున్నట్లున్నారే.? ఒక కేంద్రమంత్రి స్వయంగా పలుమార్లు ఫోన్లు చేసినా.. అందుబాటులోకి రాని ముఖ్యమంత్రి.. ఆయన కుమార్తె కమ్ ఎంపీలు అందుబాటులోకి రాలేదంటే..? తమకు నచ్చని విషయాల్లోఎలా ఉంటారన్న దానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదేమో..?