Begin typing your search above and press return to search.

స్మృతి ఇరానీకి తప్పిన ప్రమాదం

By:  Tupaki Desk   |   6 March 2016 7:36 AM GMT
స్మృతి ఇరానీకి తప్పిన ప్రమాదం
X
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి యమునా ఎక్స్‌ ప్రెస్‌ హైవేపై ఢిల్లి వెళ్తుండగా బృందావన్ సమీపంలో ఆమె కాన్వాయిలోని ముందున్న వాహనాన్ని ఇరానీ కారు ఢీకొట్టింది. దీంతో స్మృతి ఇరానీ స్వల్ప గాయాలతో బయటపడగా, ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బృందావన్ లో బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె మోకాలికి దెబ్బతగిలినట్లుగా సమాచారం. మంత్రి కాన్వాయ్ ముందున్న హోండా సిటీ కారును ఓ మోటార్ సైక్లిస్ట్ ఢీకొనడం... ఆ వెంటనే మంత్రి కారు ఆ వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మోటార్ సైక్లిస్ట్ మృతిచెందాడు. ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు.

కాగా స్మృతి ఇరానీ కారుకు పెద్ద ప్రమాదం జరిగిందన్న వార్త ఉదయాన్నే వ్యాపించడంతో ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవల కాలంలో ఆమె పార్లమెంటులో, బయట తన ప్రసంగాలతో పాపులారిటీ సాధించడంతో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఈ తరుణంలో ఆమెకు ప్రమాదం జరిగిందని తెలియగానే ఏమైందా అని చాలామంది ఆరా తీశారు.