Begin typing your search above and press return to search.
కాఫీ షాప్ లో స్మృతి సెల్ఫ్ సర్వింగ్
By: Tupaki Desk | 9 Aug 2016 5:00 AM GMTఒక కేంద్రమంత్రి కాఫీ షాప్ కు వెళితే వార్త అవుతుందా? అని ప్రశ్నించొచ్చు. మిగిలిన వారి సంగతేమో కానీ.. కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీ కాఫీ షాప్ కు వెళితే అది కచ్ఛితంగా వార్త కావటమే కాదు.. కోట్లాదిమంది మనసుల్ని దోచుకునేలా చేసింది. ఎందుకలా అంటే.. ఆమె నిరాడంబరతే అందుకు కారణంగా చెప్పాలి. వీవీఐ కల్చర్ ఎక్కువగా ఉండే ఢిల్లీ లాంటి చోట.. జెడ్ క్యాటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. వాటికి దూరంగా తనకు తాను విడిగా కాఫీ షాప్ కు వెళ్లటమే కాదు.. క్యూలో నిలుచొని తన కాఫీని తానే ఆర్డర్ ఇచ్చుకొని.. తానేస్వయంగా తెచ్చుకోవటం.. అది కూడా ఒక కేంద్రమంత్రి స్థానంలో ఉన్నోళ్లు చేయటం మామూలు విషయం కాదు కదా.
అందుకే.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. నిజానికి ఆమె కాఫీ షాప్ కు వెళ్లటం కొత్త కాదు. అదే విధంగా సెక్యూరిటీ లేకుండా వెళ్లటం ఇదే మొదటిసారి కాదు. కాకుంటే.. ఈ విషయాన్ని ఢిల్లీకి చెందిన రచయిత నిమీష్ దూబే ఆదివారం స్టార్ బక్స్ కాఫీ షాపులో ఆమె రావటం.. ఎలాంటి హడావుడి లేకుండా సెల్ఫ్ సర్వీసును తనకు తానే చేసుకున్న విషయాన్ని ఫోటో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటంతో ఈ ఇష్యూ వైరల్ కావటమే కాదు.. స్మృతి సింప్లిల్ సిటీకి కోట్లాది మంది ఫ్లాట్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు అర్థమైందా కేంద్రమంత్రి కాఫీ షాప్ కు వెళ్లటం ఎందుకు వార్త అయ్యిందో..?