Begin typing your search above and press return to search.

మ‌హిళా మంత్రిని వివాదాలు వీడ‌ట్లేదు

By:  Tupaki Desk   |   10 March 2016 1:08 PM GMT
మ‌హిళా మంత్రిని వివాదాలు వీడ‌ట్లేదు
X
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వ‌రుస వివాదాల త‌ల‌నొప్పులు త‌ప్ప‌డంలేదు. హైద‌రాబాద్‌ లోని హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేములపై చ‌ర్య‌ల‌ విష‌యంలో ఆమె దూకుడుగా వెళ్లార‌నే ఆరోప‌ణ‌ల నుంచి మొద‌ల‌యిన బ్యాడ్ టైం జేఎన్‌ యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కునే వ‌ర‌కు చేరింది. అనంత‌రం ఆమెను చుట్టుముట్టిన రోడ్డు ప్ర‌మాద వివాదం ఇపుడు ఏకంగా రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు చేరింది.

ఈ నెల 5వ తేదీన‌ ఆగ్రా-నోయిడా ఎక్స్ ప్రెస్ రహదారి పై స్మృతి ఇరానీ కాన్వాయ్ - వేరే కారును ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఈ ప్రమాదంపై స్మృతి ఇరానీ ట్విట్టర్ లో స్పందిస్తూ, తనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రోడ్డుపై నుండి తరలించామని, వారు ఆస్ప‌త్రిలో చేరిన సమాచారాన్ని కూడా తెలుసుకున్నానిని ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడి మరణించిన డాక్టర్ రమేష్ నగార్ కుమార్తె మాత్రం ప్రమాదం జరిగిన తరువాతా ప్రాధేయపడిన గానీ స్మృతి ఇరానీ స్పందించలేదని తెలిపింది. తన అన్న కూతుర్లు శాండలి, పంక‌జ్‌ లు గాయ‌ప‌డ‌గా..వారికి సహాయం కోసం స్మృతి ఇరానీని వేడుకున్నప్ప‌టికీ ఆమె కనికరించలేదని వాపోయారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై డాక్టర్ రమేష్ కుమారుడు అభిషేక్ స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి నడుపుతున్న వాహానాన్ని మంత్రి కాన్వాయ్‌లోని DL 3C BA 5315 అనే కారు వెనుక నుండి ఢీ కొట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఎఫ్‌ ఐఆర్‌ లో పేర్కొన్న డీఎల్‌ 3సి బీఎ 5315 నెంబరు గల కారు మంత్రి కాన్వాయ్‌ లో లేదని తెలిపింది. దీంతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అభిషేక్ ఏకంగా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీకి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ప్ర‌ణ‌బ్‌ కు ఆయ‌న లేఖ రాయ‌డంతో ఈ కేసులో ఆస‌క్తిక‌ర మ‌లుపులు చోటుచేసుకున్న‌ట్ల‌యింది.