Begin typing your search above and press return to search.

రుతుస్రావం సిగ్గుపడే అంశం కాదు - ఎడ్యుకేట్ చేయాలి

By:  Tupaki Desk   |   28 May 2020 6:30 PM GMT
రుతుస్రావం సిగ్గుపడే అంశం కాదు - ఎడ్యుకేట్ చేయాలి
X
రుతుస్రావం సిగ్గుపడాల్సిన విషయం కాదని - ఈ అంశంపై అమ్మాయిలు - అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. నేడు (మే 28) రుతు పరిశుభ్రత దినం సందర్భంగా ఆమె గురువారం మాట్లాడారు. దేశంలోని మహిళలకు రుతు పరిశుభ్రత ఉండేలా సరసమైన శానిటరీ న్యాప్‌ కిన్లు అన్ని జన ఔషధ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

దేశంలోని మహిళలంతా జన ఔషధి కేంద్రాల ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత - రుతుస్రావంపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది మే 28న రుతు పరిశుభ్రత దినం పాటిస్తున్నట్లు తెలిపారు. రుతుస్రావం సమయంలో పరిశుభ్రత తప్పనిసరి అన్నారు.

రుతుస్రావం అనేది స్త్రీల శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియ అని స్మృతి చెప్పారు. మహిళల జీవన చక్రంలో ఇది ఎప్పుడూ ఆటంకంగా మారకూడదని చెప్పారు. ప్రతి మహిళకు సురక్షితమైన కాలం గడిపే అర్హత ఉంటుందని, పరిశుభ్రత ప్రతి స్త్రీ హక్కు అన్నారు. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాలన్నారు.