Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి చెప్పు ఎంత సంచలనం అయిందో!
By: Tupaki Desk | 26 Nov 2016 4:53 PM GMTచెప్పు తెగిపోతే కొత్త చెప్పులు కొంటారు! కొందరైతే పడేస్తారు! మరికొందరైతే చెప్పులు కుట్టే వారి దగ్గరికెళ్లి కుట్టించుకుంటారు. తన తెగిపోయిన చెప్పును కుట్టించుకున్నారు.కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోమారు తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని పేరూరులో ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చెప్పులు కుట్టే దుకాణం కనిపించే సరికి అక్కడ కారును ఆపి స్మృతి తన చెప్పును కుట్టించుకున్నారు. చెప్పులు కుట్టే వ్యక్తికి రూ. 100 ఇవ్వగా.. తన కూలీ రూ. 10 మాత్రమే అని అతను స్మృతికి చెప్పాడు. ఏం కాదు వంద రూపాయాలు పెట్టుకోండని అతడికి కేంద్ర మంత్రి నచ్చజెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలాఉండగా బీఎస్పీ అధినేత్రి మాయావతి నోట్ల రద్దుపై ఘాటుగా స్పందించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మాయావతి మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ మైలేజీ కోసమే బీజేపీ రూ. 1000, 500 నోట్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నదని మండిపడ్డారు. ఈ నిర్ణయం వంద శాతం రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్నారని మాయావతి ఆరోపించారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నదని మాయావతి చెప్పారు.