Begin typing your search above and press return to search.
జేఎన్ యూలో ఎలాంటి పోస్టర్లు వేస్తారంటే..?
By: Tupaki Desk | 25 Feb 2016 4:30 AM GMTమానవతామూర్తులు.. మానవహక్కుల నేతలు.. కమ్యూనిస్టు నేతలు.. నిత్యం భావస్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటారు. భావస్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అని.. ఎదుటోళ్ల మనోభావాల్ని దెబ్బ తీయటం కూడా తమకు మాత్రమే చెందిన హక్కుగా భావిస్తారు. ఇలాంటి వారి మాటలన్నీ ఎలాంటి వారిని రక్షించటానికి అన్న విషయం మీద సరైన ఆధారాలతో బలమైన వాదనను వినిపించినోళ్లు ఇప్పటివరకూ పెద్దగా లేరు. కానీ.. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదన్న విషయం తాజాగా తేలిపోయింది. మత అసహనం గురించి దేశ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్.. కమ్యూనిస్టులు.. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాల్లో ఏదో జరిగిపోతుందంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వారికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పారు.
వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకన స్వేచ్ఛ గురించి పశ్చిమబెంగాల్ కు చెందిన సుగతా బోస్ చాలానే చెప్పారన్న స్మృతి.. అలాంటి వ్యక్తి తాను చెబుతున్న అంశాన్ని కోల్ కతా వీధుల్లో చర్చ జరిపే దమ్ము ఉందా? అని లోక్ సభలో సవాలు విసురుతూ.. జేఎన్ యూ వర్సటీలో 2014 అక్టోబరు 14న ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ విద్యార్థులు ‘మషిషాసురుడి అమరత్వం’’ అంటూ వేసిన పోస్టర్ లో ఏముందన్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా చదివి వినిపించారు.
తానీ అంశాలు చదువుతున్నందుకు ఆ దేవుడు తనను క్షమించాలని కోరిన స్మృతి.. పోస్టర్ లోని అంశాల్ని ఆమె మాటల్లోనే చదివితే.. ‘‘దుర్గాపూజ జాతివివక్షా పూరిత పూజ. దుర్గాదేవి.. నల్లటి చర్మం ఉన్న మహిషాసురుడిని క్రూరంగా చంపేసింది. ఆత్మాభిమానం.. ధైర్యం ఉన్న మహిషాసురుడు పెళ్లి చేసుకునేలా ఆర్యులు మాయోపాయాలు పన్నారు. వారు దుర్గ అనే సెక్స్ వర్కర్ ను ఇందుకు నియమించారు. మహిషాసురుడు ఆమెను పెళ్లాడేలా చేశారు. తొమ్మిది రోజుల హనీమూన్ తర్వాత మహిషాసురుడు నిద్రిస్తుండగా అతడిని దుర్గ చంపేసింది’’ అంటూ పోస్టర్ లోని అంశాల్ని వెల్లడించారు.
ఇలాంటి మాటలే భావస్వేచ్ఛా?అంటూ సూటిగా ప్రశ్నించిన కేంద్రమంత్రి స్మృతి.. ఇలాంటి అంశాల్ని కోల్ కతా వీధుల్లో చర్చ జరిపే ధైర్యం కమ్యూనిస్ట్ నేత సుగతా బోస్ చేస్తారా? అంటూ సవాలు విసిరారు. ఇప్పటివరకూ మీడియాలో చర్చించని ఇలాంటి విషయాల్ని పార్లమెంటులో ప్రస్తావించటం ద్వారా.. స్మృతి సూడో లౌకికవాదుల ఆట కట్టించారని చెప్పొచ్చు. మానవత్వం.. వ్యక్తి స్వేచ్ఛ అంటూ నీతులు వల్లించే వారంతా కేంద్రమంత్రి స్మృతి చెప్పిన వాదనకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.