Begin typing your search above and press return to search.
బండి బ్యాచ్ కు భారీగా దెబ్బేసిన స్మృతి ఇరానీ
By: Tupaki Desk | 3 Oct 2021 5:36 AM GMTఊహించని రీతిలో షాకిచ్చిన సొంత పార్టీ అగ్రనేతల్లో ఒకరు.. కేందమంత్రి స్మృతి ఇరానీ ఇచ్చిన షాకుతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందన్న మాట కమలనాథుల మాటల్లో వినిపిస్తోంది. 36 రోజులుగా 35 సభలతో 438 కిలోమీటర్ల పాదయాత్రతోతొలి విడత 'ప్రజా సంగ్రామ యాత్ర'ను ముగిస్తూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సభ బీజేపీ పరివారానికి ఊహించిన రీతిలో షాకిచ్చిందని చెబుతున్నారు.
పాదయాత్ర ముగింపు సందర్భంగా వాళ్లు వస్తారు.. వీళ్లు వస్తారంటూ భారీ అంచనాలు వినిపిస్తున్న వేళ.. వారెవరూ రాకుండా కేవలం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాత్రమే సభకు రావటం ఒక ఎత్తు అయితే.. మధ్యాహ్న వేళకు వస్తామన్న ఆమె.. సాయంత్రానికి కానీ రాలేదు. దీంతో.. ఆమె కోసం వెయిట్ చేసి.. వెయిట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాదయాత్ర ముగింపు సభను భారీ జోష్ తో ముగించటం ద్వారా హుజూరాబాద్ ఉప ఎన్నికకు నేతలకు.. క్యాడర్ కు కొత్త జోష్ ఇచ్చేలా ఉంటుందని భావించారు.
ఇందుకు భిన్నంగా ఆమె రావటమైతే వచ్చారు కానీ సమయానికి రాకపోవటంతో.. ఆమె సభ కోసం సిద్ధం చేసిన సమీకరణ కాస్తా.. గంటల తరబడి ఎదురుచూసి వెళ్లిపోయారు. దీంతో..కమలనాథులు తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. కాకుంటే.. అదేమీ బయటకు కనిపించకుండా.. కాసిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కవర్ చేశారని చెబుతున్నారు. ఇక.. బహిరంగ సభ విషయానికి వస్తే.. తమ లక్ష్యం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ మీదనే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదంతా ఎలా ఉన్పప్పటికి.. భారీ పాదయాత్ర ముగింపు సభ అంచనాల కంటే తక్కువగా సాగటం గమనార్హం.