Begin typing your search above and press return to search.

పెద్దల సభలో చిల్లర మాటలు..!

By:  Tupaki Desk   |   17 March 2015 4:37 AM GMT
పెద్దల సభలో చిల్లర మాటలు..!
X
రాజ్యసభలో జేడీయూ నేత శరద్‌యాదవ్‌ మాటల ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇటీవల సభలో దక్షిణాది మహిళల రంగు గురించి కామెంట్‌ చేసి వివాదం సృష్టించి ఆయన ఇప్పుడు మరింత తీవ్రమైన మాటలు మాట్లాడాడు. ఆయన తీరును తప్పుపడుతున్న అధికార పార్టీ ఎంపీలపై ఎదురుదాడి చేసిన యాదవ్‌ కేంద్రమంత్రి స్మ-తీ ఇరానీపై తీవ్రమైన వ్యాఖ్యానాలే చేశాడు.

దక్షిణాది మహిళలు నల్లగా ఉంటారని.. అయినా వారు అందంగా ఉంటారని ఇటీవల యాదవ్‌ సభలో వ్యాఖ్యానించాడు. ఆ అంశంపై ఆ రోజు నుంచి రచ్చ రేగుతూనే ఉంది. దీనిపై సోమవారం రోజున అధికార పార్టీ ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శరద్‌యాదవ్‌ తీరును వారు ఖండించారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మ-తీ ఇరానీ కూడా యాదవ్‌ మాటల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తనకు క్లాస్‌ తీసుకొంటుండటంతో జేడీయూ నేతకు కోపం వచ్చేసినట్టుగా ఉంది.

ఈ దశలో ఆయన స్మ-తీ ఇరానీపై ధ్వజమెత్తాడు. 'నువ్వెంటో నాకు తెలుసు..' అంటూ వ్యాఖ్యానించాడు. మరి ఈ వ్యాఖ్యలో ఆయన ఉద్దేశం ఏమిటో కానీ.. మిగతా సభ్యులు మాత్రం ఈ మాటతో అవాక్కయ్యారు.

ఇరానీది కూడా అదే పరిస్థితి. శరద్‌యాదవ్‌ మాటలపై ఆమె స్పందిస్తూ.. ఆయనది మహిళలను గౌరవించే వ్యక్తిత్వం కాదని సరిపెట్టారు. అయినా పెద్దల సభగా పేరున్న రాజ్యసభలో ఇలా మహిళ రంగుపొంగు గురించి చర్చలు జరగడమే అత్యంత అవమానకరమైన అంశం. తొలి రోజు చేసిన తన వ్యాఖ్యానాలకు కట్టుబడ్డానంటున్న శరద్‌యాదవ్‌ తనను తాను సమర్థించుకొంటూ కేంద్రమంత్రిపై చేసిన వ్యాఖ్యానాలు భారత చట్టసభలకే అవమానకరమైనవనడానికి సందేహించనక్కర్లేదు.