Begin typing your search above and press return to search.
జర్నలిస్టుపైకి జనాన్ని రెచ్చగొట్టిన స్మృతి
By: Tupaki Desk | 4 July 2016 8:35 AM GMT కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విపక్షాలకే కాదు మీడియాకు కూడా తరచూ టార్గెట్ అవుతుంటారు. తాజాగా ఇండియన్ మీడియాయే కాదు విదేశీ మీడియా కూడా ఆమె పట్ల విమర్శల వర్షం కురిపిస్తోంది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ సెటైర్లు వేస్తోంది. అయితే... స్మృతి ధోరణే అందుకు కారణం. ఒక జర్నలిస్టుపైకి జనాలను రెచ్చగొట్టిన కారణంగా ఆమెపై విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. ‘మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. ఆమెను మరోసారి వివాదాల్లోకి నెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టేవారు ఆ జర్నలిస్టును కొట్టేలా చేసిన తీరుపై విదేశీ మీడియా మండిపడుతోంది.
కాగా స్మృతి ఇప్పటికే అనేక వివాదాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆమె విద్యార్హతలపై ఆరోపణలున్నాయి. తాజా వివాదం ఓ టీవీ స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరు కారణంగా తలెత్తింది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి దాదాపు కొట్టినంత పనిచేశారు. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించడంతో తెలివిగా వ్యవహరించింది. అతడు అడిగిన ప్రశ్ననే మళ్లీ అడిగి స్టూడియలోని ప్రేక్షకులను రెచ్చగొట్టింది. దాంతో వారంతా కుర్చీలపైనుంచి లేచి వేదికపైకి దూసుకొచ్చారు. ఆ జర్నలిస్టును కొట్టినంత పనిచేశారు. ఆ తరువాత ఆమె డ్రమటిక్ గా ఆయన్ను కాపాడింది. జనాన్ని తానే రెచ్చగొట్టి తానే సేవ్ చేసినట్లుగా ఆమె వ్యవహరించిన తీరును ఇప్పుడు మీడియా యావత్తు తప్పుపడుతోంది.
కాగా నలభై ఏళ్ల వయసుకే మోడల్ గా - నటిగా - రాజకీయ నేతగా వేర్వేరు రంగాల్లో టాప్ పొజిషన్లు అందుకున్న ఆమెలో ఆహంకారం రోజురోజుకూ పెరుగుతోందని అంటున్నారు. గతంలోనూ ఆమె మీడియాతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు.