Begin typing your search above and press return to search.
'తుపాకీ' ప్రశ్నే స్మృతి నోటి నుంచీ వచ్చింది
By: Tupaki Desk | 25 Feb 2016 4:55 AM GMTహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో వందల మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడితే.. ఒక్కరంటే ఒక్కరి విషయంలోనూ రాహుల్ గాంధీ మాట్లాడింది లేదు.. ఏ నాడు బాధితుల కోసం తెలంగాణ గడ్డ తొక్కింది లేదు.
ఇదే విషయాన్ని ‘‘తుపాకి’’ సూటిగా ప్రశ్నించింది. ఇదేం రాజకీయం అంటూ రాహుల్ వైఖరిని ఎండగట్టింది. ఒక విద్యార్థి మరణాన్ని తన చౌకబారు రాజకీయాల కోసం వాడుకోవటమే తప్పించి.. అయ్యో ఒక విద్యార్థి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడన్న బాధ.. ఆవేదన ఎక్కడా కనిపించలేదు. నిజంగా ఒక యువకుడి మరణం రాహుల్ ను అంతలా కదిలించి ఉంటే.. తెలంగాణ రాష్ట్రం కోసం 600 మంది విద్యార్థులు (స్మృతి ఇరానీ లోక్ సభలోప్రస్తావించి సంఖ్య ఇది) చనిపోతే.. అక్కడికి రాహుల్ ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ కోసం మరణించిన కుటుంబాలకు సాంత్వన కలిగేలా ఎందుకు పర్యటించలేదు? అన్న ప్రశ్నను తుపాకి సూటిగా సంధించింది. నాడు తుపాకి చెప్పిన మాటనే నేడు.. లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించటం గమనార్హం. నాడు తుపాకీ మాటకు.. నేను స్మృతి నిలదీతతకు రాహుల్ నుంచి మౌనమే సమాధానమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు.