Begin typing your search above and press return to search.
ఆ సెంటిమెంట్ స్మృతీ ఇరానీని గెలిపిస్తుందా!
By: Tupaki Desk | 7 May 2019 1:30 AM GMTఅమేథీలో కూడా పోలింగ్ ముగిసింది. ఇక్కడ వార్ అత్యంత ప్రత్యేకం. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో స్మృతీ ఇరానీని ప్రయోగించింది భారతీయ జనతా పార్టీ. ఇది కొత్త ప్రయోగం ఏమీ కాదు. గత ఎన్నికల్లో విఫలం అయిన ప్రయోగమే ఇది.
గత ఎన్నికల్లో రాహుల్ మీద స్మృతీ ఇరానీని పోటీ చేయించి బీజేపీ. అయితే ఆమె ఓడిపోయారు. అయినా ఆమెకు కేంద్రంలో ఆమెకు మంత్రి పదవిని ఇచ్చారు. ఆమె అవకాశాన్ని వాడుకొంటూ అనునిత్యం వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇక అమేథీలో కూడా ఆమె తరచూ పర్యటిస్తూ వచ్చారు.
తను ఓడినా ఆ నియోజకవర్గంలో పర్యటించడం ద్వారా అక్కడి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు స్మృతీ ఇరానీ. ఈ క్రమంలో అక్కడ పోలింగ్ పూర్తి అయ్యింది. ఈ సారి రాహుల్ ను అమేథీలో ఓడించాలని బీజేపీ గట్టిగానే కష్టపడింది. అందులో భాగంగా స్మృతీ ఇరానీ ఆఖరి నిమిషం వరకూ అనేక అస్త్రాలను సంధిస్తూనే వచ్చారు. అందులో ఒకటి.. సెంటిమెంట్ అస్త్రం.
ఈ సారి రాహుల్ గాంధీ అమేథీతో పాటు వయనాడ్ లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని పట్టుకుని సెంటిమెంట్ రగల్చాలని స్మృతీ ప్రయత్నిస్తూ వచ్చారు. 'రాహుల్ అమేథీలో మాత్రమే కాకుండా వయనాడ్ లో పోటీ చేశారు.. అమేథీ మీద రాహుల్ కు ప్రేమ ఉంటే ఆ పని చేస్తారా? మీరు మరోసారి గెలిపించినా రాహుల్ రాజీనామా చేస్తారు. వయనాడ్ వెళ్లిపోతారు..' అంటూ స్మృతీ ఇరానీ ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలోనే ఆ సెంటిమెంట్ అస్త్రాన్నిగట్టిగా ప్రయోగించింది ఈ బీజేపీ నేత. మరి దానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కతాయో!