Begin typing your search above and press return to search.

భారత్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా.. న్యూయార్క్ వ్యక్తి అరెస్ట్

By:  Tupaki Desk   |   30 Oct 2022 1:30 AM GMT
భారత్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా.. న్యూయార్క్ వ్యక్తి అరెస్ట్
X
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు చెందిన డాకిమ్ దీశ్వన్ మెక్‌నైట్(34) భారత్ నుంచి అమెరికాకు హెరాయిన్ అక్రమ రవాణా చేసిన కేసులో ఎట్టకేలకు పట్టు పడ్డాడు. వాణిజ్య పంపిణీ ఉద్దేశంతో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను కలిగి ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేయగా నేరాన్ని అంగీకరించాడు.

2014 ఏప్రిల్‌ నుంచి పరారీలో ఉన్న నిందితుల్లో మెన్ నైట్ ఒకడు. అతనితో పాటు మరో పది మందిపై అభియోగాలు మోపారు. 2014లో ఆరుగురిని అరెస్టు చేయగా, మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2017లో ఇద్దరు పారిపోయిన వ్యక్తులను అరెస్టు చేశారు. కానీ మెన్ నైట్ చిక్కలేదు. మెక్‌నైట్ మే 2022 వరకు పరారీలో ఉన్నాడు. మిగిలిన ఇద్దరిని నార్త్ కరోలినాలోని కాంకర్డ్‌లో అరెస్టు చేశారు. వారందరూ విచారణలో ఉన్నారు. దోషులుగా నిరూపించబడే వరకు నిర్దోషులుగా ఉంటారు.

2013లో కొంతమంది వ్యక్తులు దక్షిణ కరోలినా వెలుపల నుండి కొకైన్‌ను పొంది మిడ్‌లాండ్స్‌లో పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్యాకెట్లు భారత్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక ఆధారాలు తెలిపాయి. నిందితులు హెరాయిన్ కోసం న్యూయార్క్‌కు వెళ్లి దానిని తిరిగి కొలంబియాకు రవాణా చేసి, అక్కడ పంపిణీ చేసినట్లు కూడా కనుగొన్నారు.

ప్రస్తుతం భారత్ నుంచి అక్రమంగా హెరాయిన్ తీసుకొచ్చి రవాణా చేసిన మెక్‌నైట్ ఫెడరల్ జైలులో గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్షతోపాటు పెనాల్టీతో కనీసం ఐదు సంవత్సరాలు ఎక్స్ ట్రా ఎదుర్కొంటారు. అతనికి $5,000,000 డాలర్ల జరిమానాతోపాటు కనీసం 4 సంవత్సరాల పర్యవేక్షణ కూడా విధించబడుతుంది. మాదకద్రవ్యాల కుట్రలో వీరికి సహకరించిన వారికి కూడా శిక్షలు బాగానే పడుతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.