Begin typing your search above and press return to search.

పగ పట్టి.. వెంటాడి..వెతికి మరీ కాటేస్తున్న పాము..ఒక్క నెలలో 8 సార్లు

By:  Tupaki Desk   |   2 Sep 2020 3:30 AM GMT
పగ పట్టి.. వెంటాడి..వెతికి మరీ కాటేస్తున్న పాము..ఒక్క నెలలో 8 సార్లు
X
'పాములా పగపట్టాడు' అని తరచూ అంటుంటాం. నిజంగా పాములు అంతగా పగబడతాయా..పూర్వీకులు అలా అన్నారంటే వాళ్లు ఏదొక సందర్భంలో ఇది గ్రహించే నిర్ధారించి ఉంటారు. ఇప్పటికీ చాలా మంది పాములు పగ పడతాయి అని నమ్ముతారు. కొంతమంది పాము తారసపడ్డ.. ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో కూడా వాటిని చంపేందుకు జంకుతుంటారు. ఒకవేళ చంపితే ఏమీ కాదని.. గాయపడి తప్పించుకుంటే మాత్రం పగ పెంచుకుని వేటాడుతుందని నమ్ముతుంటారు. కానీ నేటి కాలం జనం మాత్రం ఇవన్నీ వట్టి మాటలే అని కొట్టి పారేస్తారు. కానీ ఓ యువకుడిపై పగ పెంచుకున్న పాము ఒకే నెలలో అతడిపై ఎనిమిది సార్లు కాటేసింది. ఆ పాముకు భయపడి ఊరు మారినా అది మాత్రం అతడిని వదల్లేదు. ఆ యువకుడి జీవితంలో జరుగుతున్న ఘటనలు చూస్తే నిజంగా పాములు పగ పడతాయేమో అనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా రాంపూర్ కి చెందిన యశ్ రాజ్ మిశ్రా అనే యువకుడి పై పాము పగపట్టింది. గడిచిన నెల రోజుల్లోనే అతడిని పాము 8 సార్లు కాటేసింది. ఈ విషయమై యశ్ రాజ్ తండ్రి మాట్లాడుతూ నా కొడుకును వరుసగా పాము మూడుసార్లు కాటేసిన తర్వాత.. ఆ పాము బారినుంచి అతడ్ని కాపాడేందుకు మా బంధువుల ఇంటికి పంపేశాం. అయితే ఆశ్చర్యకరంగా అక్కడికి కూడా వెళ్లి అతన్ని కాటేసింది. చివరికి మా వల్ల తప్పు ఏమైనా జరిగిందోమొనని పూజలు కూడా చేయించాం. అయినా ఫలితం మాత్రం లేదు. పాము కాటేయడం మానలేదు. ఒకే నెలలో నా కొడుకుని పాము ఎనిమిదిసార్లు కాటేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకే ఎందుకు ఇలా జరుగుతోందని, పాము ఎందుకు పగ పట్టిందని తన కుమారుడు మానసికంగా ఆందోళనకు గురవుతున్నాడు. చివరికి పాములు పట్టేవాళ్లను పిలిచినా ఏమీ చేయలేకపోయారని యశ్ రాజ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క నెలలో పాము నుంచి తప్పించుకునేందుకు యశ్ కుటుంబం ఇన్ని చేసినా వదల్లేదు.. అంటే పాములు నిజంగా పగ బట్టేది నిజమేనా అని అనిపించక మానదు.