Begin typing your search above and press return to search.
స్నేక్ గ్యాంగ్ ఒక్కరినీ అత్యాచారం చేయలేదట
By: Tupaki Desk | 10 May 2016 9:55 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ ఆరాచకాల గురించి తెలిసిందే. ఒంటరిగా ఉన్న జంటల మీద దాడి చేయటం.. వారిపై అత్యాచారం లాంటి దారుణాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ మీద చాలానే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 37 జంటల మీద దాడులకు దిగిన వీరు.. పలువురు మహిళలపై అత్యాచారాలు చేసినట్లుగా చెబుతారు. ఆ మధ్య ఎంగేజ్ మెంట్ అయిన ఒక జంట తమ అతిధి గృహంలో ఉంటే.. వారిపై దాడి చేసి.. ఆమెను అత్యాచారం చేయటం.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లటంతో స్నేక్ గ్యాంగ్ దురాగతాలు బయటకు వచ్చాయి.
అనంతరం.. వీరి లీలల మీద పోలీసులు.. మీడియా దృష్టి సారించటంతో షాకింగ్ విషయాలు చాలానే బయటకు వచ్చాయి. ఈ గ్యాంగ్ కు చెందిన పలువురిని అదుపులోకితీసుకున్న పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా వీరిని విచారించినకోర్టు.. వీరు దోపిడీలకు పాల్పడటంతో పాటు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయాల్ని గుర్తించింది. అదే సమయంలో ఎవరిపైనా అత్యాచారం చేసినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయినట్లు కోర్టు వెల్లడించింది.
స్నేక్ గ్యాంగ్ కు సంబంధించిన ఎనిమిది మందిని దోషులుగా గుర్తించినప్పటికీ.. కీలకమైన అత్యాచారం చేసిన నేరం మాత్రం నిరూపితం కాని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే.. స్నేక్ గ్యాంగ్ అత్యాచార యత్నాల్ని నిరూపించలేకపోయారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. బుధవారం స్నేక్ గ్యాంగ్ కు చెందిన 8 మంది దోషులకు కోర్టు శిక్ష విధించనుంది.