Begin typing your search above and press return to search.

తగినశాస్తి; స్నేక్ గ్యాంగ్ కు యావజ్జీవం

By:  Tupaki Desk   |   11 May 2016 10:35 AM GMT
తగినశాస్తి; స్నేక్ గ్యాంగ్ కు యావజ్జీవం
X
దారుణాలకు పాల్పడిన దుర్మార్గులకు తగిన శిక్ష పడింది. అమాయక మహిళల్ని పాములతో బెదిరించి వారిపై అత్యాచార యత్నాలు చేయటం.. దోపిడీలకు పాల్పడటం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్షల్ని ఖరారు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.

ఇక.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ8కు మాత్రం 20 నెలల కారాగారాన్ని విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ స్నేక్ గ్యాంగ్ 37 మంది మహిళలపై దాడికి చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. ఒంటరిగా ఉన్న జంటలపై దాడులు చేయటం.. వారి దగ్గరున్న నగదు దోచుకోవటంతోపాటు.. వారిపై అత్యాచారాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. వారు అత్యాచారాలు చేసినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవటంతో.. ఈ గ్యాంగ్ సభ్యులు మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించినట్లుగా నిర్దారించింది. స్నేక్ గ్యాంగ్ లోని ఏడుగురికి జీవితఖైదు విధించిన కోర్టు.. ఏ 8కు మాత్రం 20 నెలల జైలుశిక్షకు పరిమితం చేసింది. వీరిపై కోర్టు తీర్పు కాపీ అందుబాటులోకి రావాల్సి ఉంది.