Begin typing your search above and press return to search.

విమానంలో పాము.. ప్రయాణికులకు షాక్!

By:  Tupaki Desk   |   8 Nov 2016 4:50 AM GMT
విమానంలో పాము.. ప్రయాణికులకు షాక్!
X
వీదిలో పాముని చూస్తేనే చాలా మందికి కాళ్లు వణికిపోతాయి. అలాంటిది విమానంలో ఉన్నట్లుండి పాము కనిపిస్తే... "స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్" సినిమా లైవ్ ఎక్స్ పీరియన్స్ అయిపోతుంది లైఫ్! కాని ఇలా విమానంలో సుమారు మూడు మీటర్ల పొడవైన పాము కనిపించిన సంఘటన మాత్రం సినిమాలోది కాదు తాజాగా నిజంగానే జరిగింది. ఆ సమయంలో ప్రయాణికుల పరిస్థితిని ఒకసారి ఊహించుకునే ముందు విషయంలోకి వెళ్తే...

మెక్సికోకు చెందిన ఓ ప్రైవేటు విమానసంస్ధ విమానంలోకి ఆదివారం ఓ విషసర్పం చొరబడతంతో ప్రయాణికులతోపాటు విమానసిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనుకోని అతిధి ఏమిటి దేవుడా అని అంతా అనుకుని ఉంటారు! ఏరో మెక్సికోకు చెందిన ఆ విమానం టొర్రెన్ నుంచి మెక్సికో నగరానికి బయల్దేరింది.. ఈ సమయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఒక పాసింజర్ కు లగేజి కంపార్ట్ మెంట్ వద్ద భారీ సైజులో ఉన్న గ్రీన్ రెప్టై‍ల్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన అతడు ఆ దృశ్యాన్ని తన మొబైల్లో బంధించాడు. ఆ తర్వాత ప్రయాణీకులందరూ పామును గమనించి షాక్ గురైయ్యారట. అయితే... ఈ విషయం తెలుసుకుని వెంటనే తేరుకున్న విమాన సిబ్బంది... క్యాబిన్ నుంచి పాము కిందకు జారి పడకముందే ఐదు వరుసల వరకూ బ్లాంకెట్లతో పాము కింద పడే ప్రదేశాన్ని కప్పేశారట.

ఈ పరిస్థితుల్లో విషయాన్ని విమాన సిబ్బంది, పైలట్లకు తెలియజేయడంతో గమ్యం చేరువలో ఉండటంతో పది నిమిషాల్లో మెక్సిలో విమానాన్ని ల్యాండ్ చేశారట. అనంతరం యానిమల్ కంట్రోల్ వర్కర్లు పామును పట్టుకోవడం... ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు స్పందించిన ఏరో మెక్సికో సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/