Begin typing your search above and press return to search.
పామును మింగలేక కక్కేసిన పాము
By: Tupaki Desk | 30 May 2017 10:13 AM GMTపాములు తమ ఆహారంగా కీటకాలు - కప్పలు - ఎలుకలు వంటి జీవులను - పక్షులను తింటాయి. కొండచిలువలు - అనకొండలు వంటివైతే కుందేళ్లు - కుక్కలు - మేకలు - ఆవు దూడలను కూడా మింగేస్తుంటాయి. అయితే, ఓ భారీ నల్ల త్రాచు వంటి పాము ఒకటి ఇంకో పామును మింగేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. మింగేసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తిరిగి వాంతి చేసుకుంది కూడా.
క్రిస్టినోఫర్ రెనాల్డ్ అనే వ్యక్తి గగుర్పొడిచే వీడియోను సోషల్ మీడియలో పోస్టు చేయగా అదిప్పుడు వైరల్ గా మారింది. ఒళ్లు జలదరించే ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు.
మామూలుగా అయితే పాములు భారీగా ఆహారం తీసుకుంటే ఆ తరువాత దేనికైనా చుట్టుకుని అరిగించుకుంటాయి. అయితే ఇక్కడ తాను మింగిన పాము కూడా పెద్దది కావడంతో దానిని పూర్తిగా మింగడం దాని వల్ల కాలేదు. దీంతో పెద్ద పాము దానిని వాంతి చేసుకోగా, బయటపడ్డ పాము సజీవంగానే ఉండడం మరో విశేషం.
అయితే.. పాములు ఇంకో పామును మింగడం విశేషమేమీ కాదు జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పెద్ద పాములు చిన్నపాములను మింగేస్తుంటాయి. కొన్ని రకాల పాములు తమ పిల్లలను కూడా మింగేస్తాయని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/