Begin typing your search above and press return to search.
స్నాప్ చాట్ పై ఇండియన్స్ వార్
By: Tupaki Desk | 16 April 2017 11:25 AM GMTఇండియాలాంటి పేద దేశంలో తమ మార్కెట్ విస్తరించాలన్న ఆలోచనమేమీ లేదంటూ స్నాప్ చాట్ సీఈవో వ్యాఖ్యానించారన్న సంగతి బయటికి పొక్కిన తరువాత భారతీయుల్లో స్నాప్ చాట్ పై ఆగ్రహం రగులుతోంది. ప్రపంచస్థాయి టెక్నాలజీ కంపెనీలన్నీ భారత మార్కెట్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తుంటే .. ఇమేజ్ మెసేజింగ్ - మల్టీమీడియా మొబైల్ అప్లికేషన్ సంస్థ స్నాప్ చాట్ సీఈవో మాత్రం ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేయడం పట్ల ట్విట్టర్ వేదికగా తిరుగుబాటు మొదలుపెట్టారు భారతీయులు. స్నాప్ చాట్ వాడుతున్న భారతీయులంతా తమతమ ఫోన్ల నుంచి ఆ యాప్ రిమూవ్ చేయాలని... ప్లేస్టోర్ లో స్నాప్ చాట్ కు రేటింగ్ తక్కువ ఇవ్వాలని పిలుపునిస్తున్నారు.
స్నాప్ చాట్ యాప్ కేవలం ధనవంతుల కోసమేనని, పేద దేశాలైన భారత్ - స్పెయిన్ కు వ్యాపారాన్ని విస్తరించాలనుకోవడం లేదని 2015లో జరిగిన ఓ సమావేశంలో ఆ సంస్థ సీఈవో ఎవాన్ స్పీగెల్ వ్యాఖ్యానించినట్లుగా సంస్థ మాజీ ఉద్యోగి ఆంథోనీ పొంప్లియానో రీసెంటుగా వెల్లడించారు. అది దుమారం రేపింది. ఈ విషయాన్ని వెరైటీ అనే అమెరికన్ వెబ్ సైట్ తన కథనంలో వెల్లడించింది. అప్లికేషన్ యూజర్ల గణాంకాలను ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిందంటూ సంస్థపై పొంప్లియానో దావా కూడా వేశారు.
నిజానికి గూగుల్ - ఫేస్ బుక్ - అమెజాన్ - మైక్రోసాఫ్ట్ - టెస్లా వంటి సిలికాన్ వ్యాలీ దిగ్గజాలతో పోలిస్తే స్నాప్ చాట్ చాలా చిన్న సంస్థ. బుల్లి కంపెనీ వైఖరికి విరుద్ధంగా దిగ్గజాలన్నీ ప్రస్తుతం భారత మార్కెట్ పైనే ప్రధానంగా దృష్టిసారించాయి. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు మొబైల్ - డాటా విప్లవం కొనసాగుతున్నది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ మనదే. అంతేకాదు, మొబైల్ హ్యాండ్ సెట్ల విక్రయపరంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశం. రిలయన్స్ జియో ఉచిత డాటా సేవలతో ప్రస్తుతం దేశంలో డాటా వినియోగం కూడా భారీగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయినా... స్నాప్ చాట్ ఇదేమీ గుర్తించకుండా అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిందంటూ భారతీయులు మండిపడతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/