Begin typing your search above and press return to search.
ఈ కంపెనీ న్యూఇయర్ పార్టీ ఖర్చు వింటే అవాక్కే!
By: Tupaki Desk | 2 Jan 2018 11:18 AM GMTకొత్త సంవత్సరం వేళ.. తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఇచ్చిన పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మల్టీ మీడియా యాప్ స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పైగల్ ఇచ్చిన న్యూఇయర్ పార్టీ పెను సంచలనంగా మారటమే కాదు.. పలు కంపెనీల ఉద్యోగులకు అసూయ పుట్టిస్తోంది.
ఉద్యోగుల న్యూఇయర్ పార్టీ కోసం స్పైగల్ ఏకంగా రూ.26 కోట్లు ఖర్చు పెట్టటం ఒకవిశేషం. ఇంతకీ ఈ గ్రాండ్ పార్టీ ఎక్క జరిగింది? ఎలా జరిగిందన్నది చూస్తే.. స్నాప్ చాట్ కంపెనీలో పని చేసే వివిధ దేశాలకు చెందిన 5 వేల మంది ఉద్యోగుల్ని ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు తీసుకొచ్చారు.
అక్కడి ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ థియేటర్ ను అద్దెకు తీసుకొని గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో భాగంగా భారీ ఎత్తున ఫుడ్ ను సర్వ్ చేయటంతో పాటు.. వివిధ రకాలపై గేమ్స్ ను నిర్వహించారు. ఇక.. అమెరికన్ ఫేమస్ పాప్ స్టార్ డ్రెక్ తో స్పెషల్ ప్రోగ్రాం చేయించారు ఈ పార్టీకి అయిన ఖర్చు మొత్తాన్ని స్నాప్ చాట్ సీఈవోనే భరించటం గమనార్హం.
గతంలో భారత్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసి.. భారతీయుల ఆగ్రహానికి గురైంది స్నాప్ చాట్. భారతీయుల్ని చిన్నబుచ్చేలా చేసిన స్నాప్ చాట్ సీఈవో వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం స్నాప్ చాట్ యాప్ ను డిలీట్ చేశారు. అందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.