Begin typing your search above and press return to search.
తన గోతిని తానే తవ్వుకున్న అమీర్ ఖాన్
By: Tupaki Desk | 5 Feb 2016 7:46 AM GMTదేశంలో అసహనం పెరిగిపోతుందని.... దేశం విడిచివెళ్లిపోతే బెటర్ అని తన భార్య అంటోందని వ్యాఖ్యానించి అందరి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇప్పటికీ ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసి రెండు నెలలువుతున్నా ఇంకా అది ఆయన్ను వెంటాడుతోంది. అమీర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఆదరణ, అభిమానం కోల్పోయారని బావిస్తున్న పలు సంస్థలు ఆయన్ను తమ ప్రచార బృందం నుంచి తప్పిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ క్రెడిబుల్ ఇండియా తన అంబాసిడర్ హోదా నుంచి అమీర్ ను తప్పించేసింది. తాజాగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ స్నాప్ డీల్ కూడా అమీర్ ఖాన్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆయన్న తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడానికి అది ఇష్టపడడం లేదు.
అమీర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలో స్నాప్ డీల్ భారీగా నష్టపోయింది. అమీర్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు స్నాప్ డీల్ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. దానివల్ల ఆ సంస్థ దారుణ నష్టాలు ఎదుర్కొంది. తమ సంస్థ వ్యాపారాభివృద్ధికి పనికొస్తాడని అమీర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న పాపానికి స్నాప్ డీల్ భారీ మూల్యమే చెల్లించుకుంది. దీంతో ఎలాగైనా ఆయన్ను వదిలించుకోవాలని డిసైడైంది. అయితే.. ఒప్పందం గడువు కూడా త్వరలో ముగియనుండడంతో అది పూర్వయ్యేవరకు ఆగుతోంది. ఆ తరువాత ఆయన ఒప్పందాన్ని కొనసాగించకుండా ముగింపు పలకాలని నిశ్చయించుకుంది. అమీర్ ఖాన్ తో కాంట్రాక్ట్ సొడిగించుకునేందుకు స్నాప్ డీల్ ఏమాత్రం ఇంటరెస్టుగా లేదని.... ఆయనతో కాంట్రాక్టు ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని అది ఎదురుచూస్తోందని సమాచారం.
అమీర్ ఖాన్ కు ఈ షాక్ లే కాదు... సోషల్ మీడియాలో జనం మరో షాక్ కూడా ఇస్తున్నారు. ఆయన తాజా చిత్రం దంగల్ కు వ్యతిరేకంగా నెటిజెన్లు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. చూడబోతే ఇండియాలో అమీర్ శకం ముగిసినట్లే అనిపిస్తోంది. తన గోతిని తానే తవ్వుకునేవారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు?