Begin typing your search above and press return to search.

పర్సులో పాతనోట్లు.. షాకిచ్చిన దొంగలు!

By:  Tupaki Desk   |   10 Nov 2016 1:04 PM GMT
పర్సులో పాతనోట్లు.. షాకిచ్చిన దొంగలు!
X
ఏమాటకామాట చెప్పుకోవాలంటే పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ సామాన్యులు - గ్రామీణ ప్రాంత ప్రజలు ఒకరకమైన ఇబ్బందులు పడుతున్నారని - నల్లబాబులు మరో రకం బాద పడుతున్నారని అనుకుంటే... తాజాగా మరోబ్యాచ్ కష్టం వెలుగులోకి వచ్చింది. వినడానికి హస్యంగా అనిపించినా... దొంగలు కూడా ఆ నోట్ల రద్దు వ్యవహారంతో తెగ ఇబ్బందులు పడుతున్నారు!! నోట్లన్నీ మళ్లీ మాములు పరిస్థితికి వచ్చేవరకూ దొంగతనానికి కూడా వెనక్కి తగ్గుతున్నట్లున్నారు! తాజాగా జరిగిన సంఘటనతో దొంగలకు ఈ నోట్లు కలిగిస్తున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి! ఈ మేరకు గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.

సాదారణంగా దొంగతనం చేసిన దొంగలు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోతారు. కానీ గ్రేటర్ నోయిడాలో దొంగలు మాత్రం, కొట్టేసిన పర్సును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. మారిన మనసు అనుకుని పొరపడేరు... దీనికి ప్రధాన కారణం ఆ పర్సులో అన్నీ పాత ఐదు వందల రూపాయల నోట్లు ఉండటమే. వివరాళ్లోకి... గ్రేటర్ నోయిడా కన స్ట్రక్షన్ సైట్ లో కూలీగా పనిచేస్తున్నాడు వికాస్ కుమార్. పని అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా బస్ స్టాండు సమీపంలోకి రాగానే - ఓ ఇద్దరు దొంగలు అతని పర్సును కొట్టేసి పరిగెత్తుకుని వెళ్లిపోయారు. ఆసమయంలో అతని పర్సులో మూడు ఐదువందల రూపాయల నోట్లు ఉన్నాయి.

దీంతో పర్సును అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వికాస్ వెతుకుతుండగా.. ఆశ్చర్యంగా ఆ దొంగలే అతని ముందు ప్రత్యక్షమయ్యారు.. అనంతరం పర్సులో అన్నీ ఐదువందల నోట్లే ఉన్నాయి... రూ.100 నోట్లు ఎందుకు పెట్టుకోలేదంటూ వికాస్ పై దాడికి పాల్పడి పర్సును వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... ఈ సంఘటనపై ఇప్పటి వరకు తమవద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదని చెబుతున్నారట. కలికాలం... కాదు కాదు.. కొత్త నోట్ల కాలం మరి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/