Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి వారసురాలు !
By: Tupaki Desk | 11 Sept 2015 2:29 PM ISTకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ మరింత బలపడుతున్నారు... పదునైన విమర్శలు... బెదిరింపులతో ప్రత్యర్థులను గడగడలాడించే ఆమెకు ఇంకో ఫైర్ బ్రాండ్ తోడవుతోంది. అరుణ తన కుమార్తెను రాజకీయ ప్రవేశం చేయిస్తున్నారు. అరుణ కుమార్తె కూడా ఫైర్ బ్రాండే అని పాలమూరు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకపోయినా అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి తాజా యూత్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తానని ఆమె ప్రకటించారు..
తాత, తల్లి, తండ్రి అంతా జిల్లాలో కీలక నేతలుగా వ్యవహరించిన నేపథ్యం ఉండడంతో ఆమెకు రాజకీయాలు నల్లేరుపై నడకే కానున్నాయి. స్నిగ్ధ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. అయితే... తండ్రి భరత సింహారెడ్డి మాత్రం ఆమె ఇంకా రాజకీయాల్లో అనుభవం సంపాదించాలని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉండడంతో అప్పటికి అనుభవం రాదా ఏంటి..?