Begin typing your search above and press return to search.

ఉత్తర అమెరికాపై ‘మంచు’ పిడుగు.. సాయం కోసం 10 లక్షల మంది

By:  Tupaki Desk   |   1 Feb 2022 3:46 PM GMT
ఉత్తర అమెరికాపై ‘మంచు’ పిడుగు.. సాయం కోసం 10 లక్షల మంది
X
ప్రపంచానికి పెద్దన్నకు ఎదురులేదు.. తిరుగులేదంటారు చాలామంది. అయితే.. అంత అగ్రరాజ్యం సైతం ప్రకృతి ముందు మాత్రం పసిపాప మాదిరి మారింది. తాజాగా విరుచుకుపడిన వాతావరణ విపత్తుతో ఉత్తర అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మంచు తుఫాన్ తో గడ్డ కట్టుకుపోయిన ఉత్తర అమెరికా ప్రజలు ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు. చలిగాలుల తీవ్రత.. భారీగా కురుస్తున్న మంచుతో వందల ఏళ్ల నాటి రికార్డులు బ్రేకులవుతున్నాయి. జన జీవనం స్థంభించిపోవటమేకాదు.. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఉత్తర అమెరికా పరిధిలో పది రాష్ట్రాలు ఈ మంచు తుఫాను తాకిడికి విలవిలలాడుతున్నాయి. ఇంటి కిటికీలు.. తలుపులు కూడా తెరవటానికి వీల్లేనంతగా మంచు పేరుకుపోయి గడ్డకట్టి పోతోంది. చలి గాలులు బలంగా వీస్తుండటంతో సముద్రం పోటెత్తుతోంది. చాలావరకు తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనికి తోడు వాతావరణ విపత్తు కారణంగా చాలాచోట్ల కరెంటు కోత నెలకొంది. దీంతో.. తమకు సాయం చేయాలని అత్యవసర సేవా విభాగానికి ఫోన్ కాల్స్ పోటెత్తుతున్నాయి.

ఒక అంచనా ప్రకారం పది లక్షల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న దుస్థితి. మంచు తీవ్రతతో పొలాలు.. ఊళ్లు.. చెరువులు.. గుట్టలు మొత్తం మంచుతో కప్పేశాయి. మొత్తంగా దట్టమైన మంచు దుప్పటి ఉత్తర అమెరికా మీద కప్పేసినట్లుగా పరిస్థితి తయారైంది. తాజా పరిణామాలతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఒక ప్రైవేటు సంస్థ రిపోర్టు ప్రకారం చేస్తూ.. దాదాపుగా 5వేలకు పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

తాజాగా విరుచుకుపడిన మంచుతుఫాను కారణంగా వందేళ్ల నాటి రికార్డులు బద్దలైపోతున్నాయి. న్యూయార్కు సెంట్రల్ పార్కులో వందేళ్ల రికార్డు బద్ధలైంది. 1904లో జనవరి 29న 4.7 అంగుళాల మందంతో మంచు కురిసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇపుడు 7.3 ఇంచుల మందంతో కప్పేసినట్లుగా చెబుతున్నారు.

న్యూజెర్సీ విషయానికి వస్తే 1987లో అత్యధికంగా 20.3 అంగుళాల మేర మంచు కురవగా.. ఈసారి ఏకంగా 33.2 అంగుళాల మందంతో మంచుకు పేరుకు పోయినట్లు చెబుతున్నారు. .దీంతో.. ఎక్కడికక్కడ కార్లు నిలిచిపోయాయి. అప్పుడెప్పుడు 1904లో ఫిలడేల్ఫియాలో 5 అంగుళాల మంచు కురవటమే రికార్డుగా చెబుతారు. తాజాగా మాత్రం అది కూడా బ్రేక్ అయి ఏకంగా 5.8 అంగుళాల మందంతో మంచు కురి