Begin typing your search above and press return to search.

అమెరికాకు షాకిచ్చిన స్నోజిల్లా ఎంత పెద్దదంటే?

By:  Tupaki Desk   |   24 Jan 2016 5:57 AM GMT
అమెరికాకు షాకిచ్చిన స్నోజిల్లా ఎంత పెద్దదంటే?
X
ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా ఇప్పుడు ప్రకృతి కన్నెర్రతో గజగజలాడిపోతోంది. వణికిస్తున్న మంచుతుఫాను కారణంగా ప్రపంచాన్ని తన సైగతో కంట్రోల్ చేసే అమెరికా అధ్యక్షడు.. ప్రకృతి ప్రకోపంతో వైట్ హౌస్ కే పరిమితమై.. గాజు అద్దాల్లో నుంచి బయట పరిస్థితిని చూసే ప్రయత్నం మాత్రమే చేయగలగారు. ‘‘స్నోజిల్లా’’ పేరుతో అమెరికా మీడియా వ్యవహరిస్తున్న ఈ మంచుతుఫాను అమెరికాను ఎంత షాక్ ఇచ్చిందో చూస్తే.. ఇదెంత భారీ ఉత్పాతమో అర్థమవుతుంది.

అమెరికాను వణికిస్తున్న తాజా మంచు తుఫాను ఎంత తీవ్రమైనదంటే..

= తాజా మంచు తుఫానుతో అమెరికాలోని 12 రాష్ట్రాల్లోని 8.5 కోట్ల మంది బాధితులుగా మారారు.

= మంచు తుఫానుతో అమెరికా అధ్యక్షడు మొదలుకొని 8.5 కోట్ల మంది ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి.

= అమెరికా జనాభాలో నాలుగో వంతు మంది ప్రజలు తాజా మంచు తుఫాను బారిన పడ్డారు.

= తాజా మంచు తుఫానుతో వాషింగ్టన్.. న్యూయార్క్.. న్యూజెర్సీ.. పెన్సిల్వేనియా.. మేరీ ల్యాండ్.. వెస్ట్ వర్జీనియా.. వర్జీనియా.. నార్త్ కరోలినా.. కెంటకీ.. జార్జియా.. టెన్సిసీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధింపు.

= రోడ్లు మంచుగడ్డగా మారిపోవటంతో ఒక్క వర్జీనియాలో 800కు పైగా రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి. ఇక్కడే తెలుగువారు అత్యధికంగా ఉన్నారు.

= మంచు తుఫానులో ఇప్పటికి 9 మంది మరణించారు.

= 1.2 లక్షల ఇళ్లకు కరెంటు సదుపాయం లేకుండా పోయింది.

= మేరీల్యాండ్ లో 28 అంగుళాల మందంలో మంచు మేట వేస్తే.. కెంటకీలో 18 అంగుళాలు.. వాషింగ్టన్ లో 7 అంగుళాల మందం మంచు కురిసింది.

= మొత్తం 7600వేల విమాన సర్వీసులు రద్దు చేశారు. అమెరికాలో దేశీయంగా నడిపే విమాన సర్వీసుల్లో ఇది 15 శాతం.

= ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ప్రకటించటంతో దేవాలయాలు.. ప్రార్థనామందిరాల్లో పెద్ద ఎత్తున వసతి కల్పిస్తున్నారు.

= వీకెండ్ జర్నీలు వద్దంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు.