Begin typing your search above and press return to search.
డైలీ సెక్స్‌తో ఇన్ని లాభాలా?
By: Tupaki Desk | 30 Aug 2022 5:21 AM GMTనేడు పెరిగిపోయిన మానవ జీవన వేగంలో వ్యక్తులకు అన్నీ ఉన్నా.. 'సుఖం' లేకుండాపోయిందనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. అతిచిన్నవయసులోనే బీపీ.. గుండె జబ్బులు.. మతిమరుపు వంటి అనేక వ్యాధు లు కూడా చుట్టు ముడుతున్నాయి. మరి వీటికి మందేంటి? ఎలా వాటిని నయం చేసుకోవాలి? వంటివి అత్యంత ప్రాధాన్యంగా మారుతున్నాయి.
అయితే.. యుక్త వయసు నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తులు వారు ఆడైనా.. మగైనా.. ఇలాంటి వాటికి దూరగా ఉండేందుకు ఒకే ఒక చిట్కా ఉందని అంటున్నారు వైద్యు లు. అదే.. నిరంతర శృంగారం!!
నమ్మినా నమ్మకపోయినా శృంగార లేమితో రక్తపోటు పెరుగుతుంది. నిద్ర అస్తవ్యస్తమవుతుంది. మతిమరు పు, గుండె జబ్బు వంటివి తలెత్తుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అనగానే వ్యాయామం, ధ్యానం వంటివే గుర్తుకొస్తాయి గానీ శృంగారం తక్కువదేమీ కాదు. ఇదీ మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి ఎంతో తోడ్పడుతుంది. ఒత్తిడికి శరీరం స్పందించే క్రమంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆ మాటకొస్తే చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒకరకంగా ఇదీ ఆందోళన దరిజేరకుండా చూసేదే. శృంగారం గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
శృంగారంతో శరీరానికి వ్యాయామం లభించటం కారణం. ఆందోళన, కుంగుబాటు తగ్గటమూ గుండెకు మేలు చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చురుకుగా శృంగారంలో పాల్గొనేవారు శారీరకంగా, మానసికం గా మరింత ఆరోగ్యంగా ఉండటం గమనార్హం. శృంగారంలో పాల్గొన్నప్పుడు నిమిషానికి సుమారు 6 కేలరీలు ఖర్చవుతాయి. ఇది కాస్త వేగంగా నడిచినప్పుడు ఖర్చయ్యే కేలరీలతో సమానం.
ఇది అంత ఎక్కువగా అనిపించకపోవచ్చు గానీ దీర్ఘకాలంలో చూస్తే తక్కువేమీ కాదు. శృంగారం మూలంగా తోటపని, నడక, మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసుకునేంత ఆక్సిజన్ శరీరానికి లభిస్తుంది కూడా. పైగా శృంగారంతో ఉత్సాహం ఇనుమడించటం వల్ల ఇతరత్రా వ్యాయామాలు చేయటం మీదా ఆసక్తి పెరుగుతుంది. ఈ మాత్రం హింటిస్తే ఇక చెలరేగిపోమా అంటారా.. మీ ఇష్టం బాబూ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.