Begin typing your search above and press return to search.
ఒంటెపాలు అంత ధర ఎందుకు? దానివలన ఉపయోగమేంటి?
By: Tupaki Desk | 30 May 2020 5:30 PM GMTఏ పాలైనా తెల్లగా ఉంటాయి. వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయని ప్రజలు తమ ఆహారంలో తప్పనిసరిగా చేసుకుంటారు. కానీ పాలల్లో వివిధ రకాలు ఉన్నాయి. వాటి ధర లీటర్‌కు రూ.50 నుంచి వందలోపు ఉంటుంది. అదే మేక పాలు అయితే రూ.వందపైనే ఉంటాయి. కానీ ఒంటె పాలు ఎంత ఉంటాయంటే.. ఏకంగా రూ.600. ఒక లీటర్ పాలు అంత ధర ఎందుకు? ఆ పాలలో ఏమిటి అత్యంత ప్రత్యేకత, అంత ప్రాధాన్యం, ధర ఎక్కువగా ఉండడానికి కారణమేంటో తెలుసుకోంది. ఈ ఒంటె పాల ఆధారంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లో ఒంటెపాలు విరివిగా లభిస్తున్నాయి. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వాస్తవంగా మార్కెట్‌లో ఒక ధోరణి ఉంటుంది. సరఫరా తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సరఫరా అధికంగా ఉంటే ధర తక్కువగా ఉండడం ఇది ఆర్థిక సూత్రం. దీని మాదిరి ఒంటె పాలు చాలా తక్కువగా లభ్యమవుతాయి. అందుకే అంత ధర ఉంది. దీంతోపాటు ఆ పాలలో ఎక్కడా లభించని పోషకాలు లభిస్తాయి. అందుకే ఆ పాలు అంతలా ధర ఉంటుంది. ఒంటె పాలకు డిమాండ్ బాగా ఉందని గుర్తించి రాజస్థాన్ నుంచి కొందరు ఒంటెల వ్యాపారులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ విధంగా ఒంటె పాలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఒంటె పాలలో ఉండే ఔషధ గుణాలు, ప్రత్యేకతలు ఇవే..
- ఒంటె పాలలో ఒమేగా-3ఫాటీ ఆసిడ్స్, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి.
- సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.
- విటమిన్ సి, బీ 2, ఏ, ఈ విటమిన్లు అధికసంఖ్యలో ఉంటాయి.
- ఈ పాలలో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.
- మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజ లవణాలు భారీగా ఉంటాయి.
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే వారి ఆరోగ్యం మెరుగవుతుంది.
- టీబీ, జాండిస్, రక్తహీనత, ఆటిజం, మధుమేహం వంటి వ్యాధుల బాధితులకు దీన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒంటె పాలను వివిధ వ్యాధిగ్రస్తులకు ఇస్తుంటారు.. తప్పనిసరిగా ఇస్తారు.
- బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఒంటె పాలు తాగిస్తే వికసిస్తుంది.
- ఒంటె పాలతో అలర్జీ తొలగిపోతుంది.
- ఈ పాలు మన రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహులకు 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటిలోనూ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
- రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఒంటె పాలు దోహదం చేస్తాయి.
ఒంటె పాలలో ఇన్ని లక్షణాలు, ఇంత ప్రాధాన్యం ఉన్నాయని తీసుకుంటే ప్రమాదమే ఉంది. అందుకే వైద్యుల సలహాతో ఈ పాలను తీసుకుంటే మేలని పలువురు చెబుతున్నారు. వైద్యుడి సలహా మేరకు దీర్ఘకాల వ్యాధిగ్రస్తుతలు ఈ పాలను తీసుకుంటే మేలు అని పేర్కొంటున్నారు.