Begin typing your search above and press return to search.
గెజెట్ లో మరీ ఇన్ని తప్పులా ?
By: Tupaki Desk | 18 July 2021 5:30 AM GMTసమైక్య రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు రాష్ట్ర విభజన చట్టాన్ని తప్పుల తడకగా తయారు చేసినట్లే ఇపుడు జల వివాదాల పరిష్కారం పేరుతో కేంద్రం జారీచేసిన గెజెట్లో కూడా చాలా తప్పులున్నాయి. రెండు రాష్ట్రాల్లోను వివాదాస్పదమైన కొన్ని ప్రాజెక్టుల ఊసే వదిలేసింది కేంద్రం. అలాగే దశాబ్దాల క్రిందే నిర్మించి నీటి విడుదల లేని అసలు సమస్యలే లేని ప్రాజెక్టులను కూడా గెజెట్ లో చేర్చేసినట్లు అర్ధమైపోతోంది. ఏతా వాత గెజెట్ చూసిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే గెజెట్ లో చాలా తప్పులున్నట్లు స్పష్టమైపోతోంది.
ప్రతి అక్షరాన్ని ఆచితూచి గెజెట్ తయారుచేసినట్లు చెప్పుకుంటున్న కేంద్రం మరి లోపాలపైన మాత్రం ఏమీ మాట్లాడటంలేదు. జల వ్యవహారాల నిపుణుల ప్రకారం గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ క్రింద కేంద్రం 107 ప్రాజెక్టులను తీసుకోవటమే పెద్దతప్పట. ఇన్ని ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసుకుని నిర్వహించటమంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహించాలంటే సుమారు 5 వేలమంది ఉద్యోగులు అవసరమని అంచనా వేశారు. ఇన్ని వేలమంది బోర్డులకు ఎక్కడినుండి వస్తారని నిపుణులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం లేదు.
అన్నీ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చేబదులు వివాదాస్పదమైన ప్రాజెక్టులను మాత్రమే చేరిస్తే సమస్య తొందరగా పరిష్కారమవుతుందని నిపుణలంటున్నారు. వివాదానికి మూలకారణమైన ఏపిలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల ప్రస్తావనే గెజెట్ లో లేదు. ప్రకాశం జిల్లాలో ఎంతో కీలకమైన, పనులు పూర్తయిపోవచ్చిన వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం అసలు గుర్తించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీళ్ళు ఎలా ఇస్తారో అర్ధం కావటంలేదు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే కృష్ణా బోర్డు నీళ్ళిస్తుందా అనేది సందేహంగా మారింది.
ఇదే సమయంలో ఎలాంటి వివాదం లేని మాచ్ ఖండ్, సీలేరు, కాటన్, ప్రకాశం బ్యారేజీలను గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిలోకి కేంద్రం చేర్చటంపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా తొందరలోనే గోదావరి బోర్డు పరిధిలోకి వెళిపోతుంది. పోలవరం ఆధారంగా నిర్మితమవుతున్న 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా రాష్ట్రం పరిధిలోనుండి కేంద్రం చేతిలోకి వెళిపోబోతోంది.
నిర్మాణం పూర్తయి ఆయకట్టుకు నీరందిస్తున్న తెలంగాణాలోని పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను నిర్మాణంలో ఉన్న పధకాలుగా చూపటమే గెజెట్లోని తప్పులకు ఉదాహరణలు. తాజా గెజెట్ లో రెండు బోర్డుల్లోను ఏపి, తెలంగాణా నుండి ప్రాతినిధ్యం లేకపోవటమే విచిత్రంగా ఉంది. ఎక్కడైనా సమస్యలు వచ్చినపుడు క్షేత్రస్ధాయిలోని సమాచారాన్ని బోర్డులోని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఎలా సేకరిస్తారు ? రెండు రాష్ట్రాల నుండి ఏ చీఫ్ ఇంజనీరో లేకపోతే ఇంకెవరైనా ఉన్నతాధికారులకు కూడా చోటిచ్చుంటే బాగుండేది.
మొత్తంమీద గెజెట్ ను డీటైల్డ్ గా స్టడీ చేసిన నిపుణులు ఇందులో చాలా తప్పులున్నట్లు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులతో చర్చించకుండా గెజెట్ ను కేంద్రమే హడావుడి తయారు చేసింది. దీంతోనే విభజన చట్టంలో ఎలాంటి తప్పులున్నాయో ఇప్పటి గెజెట్లో కూడా అలాంటి తప్పులే పునరావృతమైనట్లు అర్ధమవుతోంది. అందుకనే గెజెట్లో సవరణకు ఏపి ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది.