Begin typing your search above and press return to search.

త‌లాక్ అంటే సంఘ బ‌హిష్క‌ర‌ణట‌..కానీ తీయ‌ర‌ట‌

By:  Tupaki Desk   |   23 May 2017 6:57 AM GMT
త‌లాక్ అంటే సంఘ బ‌హిష్క‌ర‌ణట‌..కానీ తీయ‌ర‌ట‌
X
ట్రిపుల్ త‌లాక్ మీద చిత్ర‌మైన వాద‌న‌ను వినిపించింది ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో సాగుతున్న ఈ కేసుపై త‌న అఫిడ‌విట్‌ ను తాజాగా దాఖ‌లు చేసింది. ఓవైపు ట్రిపుల్ త‌లాక్‌ కు సంబంధించి తీర్పును రిజ‌ర్వ్ చేసి ఉంచ‌గా.. మ‌రోవైపు త‌న అఫిడ‌విట్ ను దాఖ‌లు చేస్తూ ఒక‌దాంతో మ‌రొక‌టి పొంత‌న లేని చిత్ర‌మైన వాద‌న‌ను వినిపించింది.

బోర్డు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో చెప్పిన మాట‌ల్ని చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ట్రిపుల్ త‌లాక్ కాకుండా సింగిల్ త‌లాక్ అంటూ స‌రికొత్త విధానాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. త‌లాక్ వ‌ద్ద‌ని చెప్పేలా ప్ర‌చారం చేస్తామ‌ని చెప్ప‌టం.. త‌లాక్ చెప్పే ముస్లింల‌కు సంఘ బ‌హిష్క‌ర‌ణ విధించాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకుంటామ‌న్న మాట‌లు చెప్పారే కానీ.. త‌లాక్ ను మాత్రం వ‌దులుకోవ‌టానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ట్రిపుల్ త‌లాక్‌ ను వ‌ద్ద‌ని పెళ్లి కొడుకుల‌కు చెప్పాల‌ని ఖాజీల‌కు స‌ల‌హాలు జారీ చేస్తామ‌ని చెబుతూనే.. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాన్ని ప‌ర‌స్ప‌ర సంప్ర‌దింపుల‌తో ప‌రిష్క‌రించుకోవాల‌న్న సూచ‌న చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. ష‌రియ‌త్‌ కు అనుగుణంగా ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని జారీ చేసిన బోర్డు.. దంప‌తుల మ‌ధ్య రాజీ కుద‌ర‌ని ప‌క్షంలో ట్రిపుల్ త‌లాక్ ను ఒకేసారి చెప్ప‌కుండా నెల‌కోసారి చొప్పున మూడు నెల‌ల్లో చెబితే.. వ‌ర్తిస్తుంద‌న్న కొత్త వాద‌న‌ను వినిపించింది.
తాజా అఫిడ‌విట్ ను చూస్తే.. గ‌తంలో పోలిస్తే బోర్డు కాస్త మెత్తబ‌డి కింద‌కు దిగింద‌ని చెప్పాలి.

అదే స‌మ‌యంలో ట్రిపుల్ త‌లాక్‌ ను వ‌దులుకోవ‌టానికి తాము ఎంత‌మాత్రం సిద్ధంగా లేమ‌న్నట్లుగా బోర్డు వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం. త‌మ వ‌ర్కింగ్ క‌మిటీలో జ‌రిగిన భేటీలో ట్రిపుల్ త‌లాక్‌ కు వ్య‌తిరేకంగా తీర్మానం చేశామ‌ని చెబుతూనే.. నిష్కార‌ణంగా ట్రిపుల్ త‌లాక్ తో విడాకులు ఇవ్వ‌టాన్ని ష‌రియ‌త్ తీవ్రంగా ఖండిస్తోంద‌ని పేర్కొంది. ఈ సందేశాన్ని ముస్లింల‌లోని అన్ని వ‌ర్గాల‌కు.. ముఖ్యంగా పేద‌ల‌కు చేర‌వేయ‌టానికి అన్ని విధాలుగా ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ అంశంపై ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించింది. బోర్డు ఇంత క‌ష్ట‌ప‌డే బ‌దులు.. ట్రిపుల్ త‌లాక్‌ ను ర‌ద్దు చేయ‌మ‌ని మాత్రం సుప్రీంను కోర‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ట్రిపుల్ త‌లాక్ ను చెప్ప‌కూడ‌ద‌నే ష‌ర‌తును నిఖానామాలో పొందుప‌ర్చాల‌ని పెళ్లి జ‌రిపించే వ్య‌క్తికి సూచిస్తార‌ని త‌న అపిడ‌విట్ లో బోర్డు పేర్కొంది.ఓప‌క్క ట్రిపుల్ త‌లాక్‌కు ప‌రిమితులు విధిస్తామ‌ని చెబుతూనే.. ట్రిపుల్ త‌లాక్‌ ను ర‌ద్దు చేసేందుకు మాత్రం నో చెప్ప‌టం చూస్తే.. బోర్డు రెండు నాల్క‌ల ధోర‌ణి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

బోర్డు తాజాగా దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పేర్కొన్న అంశాలు కాస్త చిత్రంగా అనిపించ‌క మాన‌వు. ట్రిపుల్ త‌లాక్ లో తాము త‌ప్ప మ‌రెవ‌రూ నిర్ణ‌యం తీసుకోకూడ‌ద‌న్న‌ట్లుగా బోర్డు వాద‌న ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. తాజా ఆఫిడ‌విట్ లో భార్య‌భ‌ర్త‌ల‌కు బోర్డు కొన్ని నియ‌మావ‌ళుల్ని పేర్కొంది. వీటిల్లో ముఖ్య‌మైన వాటిని చూస్తే..

+ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాన్ని తొలుత ప‌ర‌స్ప‌ర సంప్ర‌దింపుల ద్వారా ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

+ ఒక‌రి త‌ప్పుల్ని మ‌రొక‌రు మ‌ర్చిపోయేందుకు ప్ర‌య‌త్నించాలి.

+ ఒక‌వేళ అలా సాధ్యం కాని వేళ‌లో తాత్కాలికంగా విడిగా ఉండాలి.

+ దంప‌తుల మ‌ధ్య నెలకొన్న విబేదాల్ని రాజీ చేసేందుకు ఇరు కుటుంబాల్లోని పెద్ద‌లు ప్ర‌య‌త్నించాలి.

+ అలా కూడా కుద‌ర‌క‌పోతే విడాకులు తీసుకోవ‌చ్చు. అప్పుడు కూడా త‌లాక్ అని ఒక్క‌సారే చెప్పాలి.

+ త‌లాక్ చెప్పిన త‌ర్వాత వెయిట్ చేసే కాలం (ఇద్ద‌త్‌) వ‌ర‌కూ దంప‌తులు ఇద్ద‌రూ విడిగా ఉండాలి.

+ ఒక‌వేళ ఇద్ద‌త్ స‌మ‌యంలో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మైతే క‌లిసి జీవించొచ్చు.

+ ఒక‌వేళ ఇద్ద‌త్ స‌మ‌యంలో భార్య గ‌ర్భిణి అయితే ప్ర‌స‌వం వ‌ర‌కూ ఇద్ద‌త్ పొడిగించాలి.

+ ఇద్ద‌త్ స‌మ‌యంలో రాజీ కుదిరితే స‌ద‌రు జంట మ‌ళ్లీ పెళ్లాడి వివాహాన్ని పున‌రుద్ద‌రించుకోవ‌చ్చు.

+ తొలి త‌లాక్ చెప్పిన త‌ర్వాత రెండో నెల‌లో మ‌రో త‌లాక్‌.. మూడో నెల‌లో మ‌రో త‌లాక్ చెప్పి విడాకులు పొందొచ్చు.

+ భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌ని ప‌క్షంలో భార్య ఖులా ద్వారా విడాకులు పొందొచ్చు.

ఇదిలా ఉండ‌గా.. ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. త‌న వాద‌న‌తో బోర్డు గంద‌ర‌గోళాన్ని సృష్టించింద‌ని త‌లాక్ పై కోర్టును ఆశ్ర‌యించిన ఫ‌రా ఫైజ్ విమ‌ర్శించారు. బోర్డు ప్రైవేటు సంస్థ అని.. ఖాజీల‌కు అదిచ్చే ఆదేశాలు చెల్ల‌వని ఆమె చెబుతున్నారు. గ‌తంలో మాదిరి ట్రిపుల్ త‌లాక్‌ను స‌మ‌ర్థించ‌కుండానే కొన్ని ప‌రిమితుల‌తో త‌లాక్‌ను కొన‌సాగించాలంటూ దాఖ‌లు చేసిన తాజా అఫిడ‌విట్ పై సుప్రీం ఎలా స్పందిస్తుందన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.