Begin typing your search above and press return to search.
సీటు సీటు మధ్య డిస్టెన్స్.. ఆఫీస్‌ల్లోనూ భౌతిక దూరం పాటించండి
By: Tupaki Desk | 16 April 2020 3:30 PM GMTకరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ మొదటి దశ సంపూర్ణంగా పూర్తి కాగా రెండో దశ మే 3వ తేదీ వరకు కొనసాగుతోంది. అయితే రెండో లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రారంభంలోనే సడలింపులతో లాక్‌డౌన్ విధిస్తారని అంతటా చర్చ సాగగా వాటన్నిటికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. అయితే పేరుకు లాక్‌డౌన్ విధించగా క్రమంగా కొన్ని కొన్ని సడలింపులు చేస్తారని తెలుస్తోంది. దానికనుగుణంగా ప్రస్తుతం పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. పని ప్రాంతాల్లో (వర్క్ ప్లేసెస్) అనుసరించాల్సిన గైడ్‌లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది.
ఐటీ, ఐటీ ఎనాబుల్డ్ సర్వీసెస్‌లకు, ఈకామర్స్ కంపెనీలకు ఈ తాజా గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. 50 శాతం ఉద్యోగులతోనే కార్యాలయాలను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయాలు, కర్మాగారాలను తెరిచి పనులు ప్రారంభించాలని ఆదేశించింది. అయితే ఈ సమయంలో అన్ని పని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కాలంలో శానిటైజర్స్ అందించాలని ప్రభుత్వం సూచించింది. టెంపరేచర్ పరీక్షించే ఏర్పాట్లు కూడా చేయాలని తెలిపింది. బయట నుంచి వచ్చే వర్కర్లకు, ప్రత్యేక రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పింది. 30-40 శాతం ప్యాసెంజర్ కెపాసిటీతోనే ఆఫీసు వాహనాలను కూడా అనుమతించాలని తెలిపింది. ప్రతి ఉద్యోగికి గేట్ వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పనిసరిగా వెల్లడించింది. కార్యాలయాల ప్రాంతాల్లో శుభ్రత పాటించాలని సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగికి ఉద్యోగికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని పేర్కొంది.
భౌతిక దూరం విధానాలను తప్పని సరిగా పాటించాలని, రెండు షిఫ్ట్‌లకు మధ్య ఒక గంట తేడా ఉండాలని తెలిపింది. తరచూ శానిటైజ్ చేస్తూ ఉండాలని సూచించింది. మాన్యుఫాక్చరింగ్ సంస్థ అయితే.. రెండు షిఫ్ట్ లు కలవకుండా చూసుకోవాలని, భోజనం సమయంలోనే ఉద్యోగులు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. పరోక్షంగా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.