Begin typing your search above and press return to search.

ఇంకో ఎన్నికల సెల‌బ్రిటీ..ఈ సోష‌ల్ మీడియా స్టార్ ఎవ‌రంటే

By:  Tupaki Desk   |   13 May 2019 2:21 PM GMT
ఇంకో ఎన్నికల సెల‌బ్రిటీ..ఈ సోష‌ల్ మీడియా స్టార్ ఎవ‌రంటే
X
ఎల్లో కలర్ శారీ కట్టుకుని.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. ఎడమ చేతిలో యాపిల్ ఫోన్… కుడిచేతిలో ఈవీఎం పట్టుకుని.. మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో… పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల చాలామంది ఫోన్లలో తిరిగాయి. సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.ఆమె ఎవరు అనేదానిపై చాలామందిలో ఆసక్తి ఏర్పడింది. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అని - ఆమె పేరు రీనా ద్వివేది అని వెల్ల‌డైంది. స‌రిగ్గా ఆమె లాగే..మ‌రో అధికారిణి పోలింగ్‌ లో పాల్గొన్న సంద‌ర్భంగా సెల‌బ్రిటీ అయింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌ లో ఈ కొత్త సెల‌బ్రిటీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆరో విడ‌త పోలింగ్ సంద‌ర్భంగా లాల్ ప‌రేడ్ గ్రౌండ్స్ వ‌ద్ద‌ ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌ర‌య్యే సిబ్బందికి ఎవ‌రు, ఎక్క‌డెక్క‌డ విధుల్లో పాల్గొనాలో వివ‌రించారు. వారి చేతికి ఈవీఎం స‌హా ఎన్నిక‌ల సామాగ్రిని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న ప్రెస్ ఫొటోగ్రాఫ‌ర్లు ఓ లేడీ ఆఫీస‌ర్‌ ను క్లిక్ మ‌నిపించారు. లేత నీలంరంగు స్లీవ్‌ లెస్ గౌను వేసుకున్న ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో మ‌రో సునామీని సృష్టించాయి. దీంతో ఆమె ఎవర‌ని ఆరా తీయ‌గా..గ్రామీణ బ్యాంకు ఉద్యోగిని యోగేశ్వ‌రి గోడ్తే ఓంకార్‌ గా గుర్తించారు. యోగేశ్వ‌రి గోవింద్‌ పురాలోని ఐటీఐలో ఏర్పాటు చేసిన‌ పోలింగ్ బూత్ విధులు నిర్వ‌హించారు.

ఇక‌ సోష‌ల్ మీడియాలో హ‌ఠాత్తుగా స్టార్ అయిపోయిన నేప‌థ్యంలో యోగేశ్వ‌రిని ఓ మీడియా సంస్థ సంప్ర‌దించింది. త‌న‌కు మోడ‌లింగ్ అంటే ఇష్ట‌మ‌ని...ఇలా హ‌ఠాత్తుగా స్టార్ అవుతాన‌ని అనుకోలేద‌న్నారు. విద్యాభాస్య స‌మ‌యం నుంచే మోడలింగ్‌లో రాణించాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని చ‌దువుకుంటూనే, మోడ‌లింగ్ వైపు ప్ర‌య‌త్నాలు చేశాన‌ని వివ‌రించారు. అయితే, త‌న చ‌దువు పూర్త‌యిన వెంట‌నే బ్యాంకులో ఉద్యోగం రావ‌టంతో త‌న ఇష్టాన్ని వ‌దులుకొని ఉద్యోగం నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇలా హ‌ఠాత్తుగా సెల‌బ్రిటీ అయిపోవ‌డం సంతోషాన్ని ఇస్తోంద‌న్నారు.

కాగా, పోలింగ్ రూపంలో ఇలా రీనా ద్వివేదీ - యోగేశ్వ‌రి సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీ అవ‌డం వారికి సంతోషాన్ని ఇస్తున్న అంశంగా ఉండ‌గా....మ‌రోవైపు పోలింగ్ ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగులు నిరాస‌క్తంగా పాల్గొంటార‌ని భావించే వారికి...దానికి భిన్నంగా ఇంకొంద‌రు ఉన్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.