Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో ‘పన్నీర్’ మసాలా
By: Tupaki Desk | 8 Feb 2017 11:24 AM GMTతమిళనాడులో రాజకీయం రాజుకున్న వేళ సోషల్ మీడియాలో మంచీచెడు రెండు విధాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు.. దీనిపై పెద్ద ఎత్తున ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటి దాకా పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరినీ ఆటాడుకున్న సోషల్ మీడియా రాత్రి నుంచి రూటు మార్చింది. పన్నీర్ ప్రసంగం తరువాత యూ టర్ను తీసుకుంది. పన్నీర్ మద్దతుగా, ఆయన్ను హీరోలా చూపిస్తూ పోస్టింగులు పెడుతున్నారు. అయితే, అదే సమయంలో శశికళను మాత్రం ఆడుకుంటున్నారు.
శశికళను తొలుత సీఎం పదవికి ఎన్నుకున్న తరువాత సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయింది. అందులో జయ వెనుక ఆమె లగేజి పట్టుకుని శశికళ సేవకురాలిలా నడుస్తుంటుంది. తాజాగా ఆ చిత్రానికి మరో చిత్రం యాడయ్యింది. అప్ డేట్ వెర్షన్ గా వచ్చిన ఆ చిత్రం మరింత నవ్వు తెప్పిస్తోంది. జయ వెనుక పనిమనిషిలా పనిచేసిన శశికళ సీఎం అయితే.. భవిష్యత్తులో శశికళ పనిమనిషి కూడా సీఎం కావొచ్చంటూ వారిద్దరూ ఉన్న ఫొటోలను పెడుతున్నారు.
కొందరైతే జయ, పన్నీరున్న చిత్రాలను పోస్ట్ చేస్తూ జయ.. పన్నీర్ నే సీఎంగా కోరుకుని ఉంటారని.. ఒకవేళ ఆమె శశికళను సీఎం చేయాలనుకుంటే పలుమార్లు ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ ను ఎందుకు నియమించారని.. అదేదో శశినే నియమించేవారు కదా అన్న వాదన వినిపిస్తున్నారు.
ఇంకొందరు పన్నీర్, శశిలతో పాటు ప్రధాని మోడీని కూడా ఆడుకుంటున్నారు. పన్నీర్ ది యాక్షన్ అని.. శశికళది ఓవర్ యాక్షన్ అని.. మోడీ ఏకంగా యాక్షన్ స్కూల్ కు ఛైర్మన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇంకొందరు ప్రస్తుత పరిస్థితులను క్రికెట్ తో పోల్చుతూ సెటైర్లేస్తున్నారు. శశికళ సీఎం పోస్టు ముందు రన్ అవుట్ పరిస్థితుల్లో ఉన్నట్లుగా.. అలాగే.. పన్నీర్ లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టినట్లుగా చిత్రాలు పెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా అంతా ఇప్పుడు పన్నీరే హాట్ టాపిక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/