Begin typing your search above and press return to search.
జగన్ కు ఆ మీడియానే ఆధారమా..!
By: Tupaki Desk | 19 Feb 2019 3:30 PM GMTరాష్ట్రంలో మెజారిటీ వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే అని చెప్పనక్కర్లేదు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. కాంగ్రెస్ హయాం నుంచినే ఈ పరిస్థితి ఉంది. మెజారిటీ మీడియా తెలుగుదేశం పార్టీకే వత్తాసు పలుకుతూ ఉంది.ఇక జగన్ కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నాకా పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చింది. మీడియా యజామానులు అంతా దాదాపు ఒకే కులం వారు.
చంద్రబాబు నాయుడు స్వకులస్తులు. చంద్రబాబుతో వారు భారీగా ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు కూడా. ఇలాంటి నేఫథ్యంలో వాళ్లంతా చంద్రబాబు నాయుడి భజనే చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తూ ఉన్నాయి తెలుగు మీడియా వర్గాలు.
ఎవరు ఏమనుకున్నా తాము చంద్రబాబు భజనే చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. జగన్ వ్యతిరేకత - చంద్రబాబు అనుకూలతే ఊపిరిగా సాగుతూ ఉన్నాయి తెలుగు మీడియా వర్గాలు. రెండు ప్రధాన పత్రికలది - పదికి పైగా ఇరవై నాలుగు గంట వార్తా చానళ్లదీ ఇదే కథ.
ఇక జగన్ కూ సొంత మీడియా ఉంది. అయితే వివిధ వ్యవహారాలతో ఈ మీడియా వర్గం అంతగా రాణించలేకపోతోంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ కు అనుకూలంగా నిలుస్తున్న మీడియా ఏదైనా ఉంది.. అంటే అది సోషల్ మీడియా మాత్రమే. ఎవరికి వారే బ్రాడ్ కాస్టర్స్ అయిన సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లు గట్టిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వైపున్న తప్పులను ఎండగట్టడంలో సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురు యాక్టివ్ గా ఉంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పాత్రను కూడా సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్నారు. ఇలా టీవీ - ప్రింట్ మీడియాల నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సహకారం అందకపోయినా.. సోషల్ మీడియా నుంచి మాత్రం అపారమైన సహకారం అందుతూ ఉంది.
అక్కడకూ సోషల్ మీడియాను కట్టడి చేయడానికి తెలుగుదేశం వాళ్లు గట్టిగానే ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేసే సోషల్ మీడియాలోని నెటిజన్లపై కేసులు కూడా పెట్టారు. అరెస్టులు కూడా చేశారు. అయినా సోషల్ మీడియాను కట్టడి చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్లకు సాద్యం కావడం లేదు.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం అనుకూల మీడియాను ధాటిగా ఎదుర్కొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. రానున్న ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాది కీలక పాత్ర కాబోతోంది.