Begin typing your search above and press return to search.
తెలంగాణలో 'సోషల్' పొలిటికల్ వార్!
By: Tupaki Desk | 7 Sep 2018 1:30 AM GMTసామాజిక మాధ్యమం. ప్రజల చేతులలోనే సర్వం...అంగట్లోనే అంగడి......మీట నొక్కితే చాలు కావల్సిన వస్తువు మన ఒడిలోకి వచ్చి వాలుతుంది... గతంలో ఒక వార్త ప్రజలకు చేరాలంటే చాలా రోజులు పట్టేది...... కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పుణ‌్యమా అని క్షణాలలో చేరిపోతోంది. అధునిక టెక్నాలజీ అన్ని మూలలకు వ్యాపించింది. ముఖ్యంగా చాలామంది యువతీ యువకులు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అలాగే వారి ఎన్నికల ప్రచారానికి ఈ అధునికతను జోడించారు. రాజకీయ నాయకులు తమ ఎన్నికల ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్నారు. తద్వారా గతం లో కంటే వేగంగా ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీలలో చోటామోటా నాయకుల నుంచి మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు ఇలా అందరూ కూడా తమ పార్టీకి అనుకూలంగా ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.
తాము పెడుతున్న పోస్టులకు వస్తున్న లైకులు కామెంట్లు - షేర్లను బట్టి తమ పార్టీపైనా - తమ భవిష‌్యత్తు వ్యూహాలపైనా అంచనాలకు వస్తున్నారు. ఒక్క పార్టీ అని కాదు - దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఫేస్ బుక్ - ట్విటర్ - ఇన్ స్ట్రాగ్రామ్ - వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు. అయితే వీటిలో వాట్సాప్ ఎక్కువ వాడుకలో ఉందని అంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు వారి అనుమానాలను కూడా నివృత్తి చేస్తున్నారు. కొంతమంది నాయకులు వాట్సాప్ లో తమ తమ పేరుతో గ్రూపులను క్రియేట్ చేసి - ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కొంతమంది నాయకులు యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో తమ ప్రచారం కోసం ఎవరికి వారు కొంతమంది సాంకేతిక నిపుణులను నియమించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక లైకులు - కామెంట్లు - షేర్లు ఉన్న వారికి టిక్కెట్లు ఇస్తామని ఉత్తరాదిన చెబుతోంది. తెలంగాణలో కూడా ఇదే పంథాను అనుసరిస్తే ఇక కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల వైపు పరుగులు పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో ట్విటర్ ద్వారా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలకు ట్విటర్ ద్వారానే పరిష్కారం చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కొంత మంది నాయకులకు మాత్రమే సామాజిక మాధ్యమాల పరిజ్ఞానం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరికే ఈ అనుభవం ఉంది. లోకమంతా సామాజిక మాధ్యమాల వైపు చూస్తున్న తరుణంలో ....అన్ని పార్టీలు వాటినే ఆశ్రయించాల్సి వస్తోంది.