Begin typing your search above and press return to search.

ట్రంప్ భార్య‌ను సోష‌ల్ మీడియా వెక్కిరిస్తోంది

By:  Tupaki Desk   |   5 April 2017 5:23 PM GMT
ట్రంప్ భార్య‌ను సోష‌ల్ మీడియా వెక్కిరిస్తోంది
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సతీమణి మిలానియా ట్రంప్ కు ఊహించ‌ని స్పంద‌న వ‌స్తోంది. దేశాధ్య‌క్షుడి సతీమ‌ణి హోదాలో మిలానియా వైట్‌ హౌస్‌ లోకి విచ్చేశారు. ఐతే ఆమె ఇంక అధికారికంగా ఇక్కడ నివాసం ఉండేందుకు మాత్రం మరింత సమయం పట్టనుంది. వైట్ హౌస్‌ లో అధికారికంగా ఫోటో దిగేందుకు ఆమె శ్వేత‌సౌధానికి వ‌చ్చి ఈ చిత్రాన్ని అధికారులు విడుదల చేశారు. ఈ ఫొటోపై ఊహించ‌ని కామెంట్లు వెలువ‌డుతున్నాయి.

శ్వేత‌సౌధంలోని ఓ కిటికీ ముందు దిగిన ఈ ఫొటోలో మిలానియా నలుపు రంగు జాకెట్‌ వేసుకుని.. చేతులు కట్టుకుని కన్పించారు. ‘ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది` అని ఈ సందర్భంగా మిలానియా చెప్పారు. రాబోయే రోజుల్లోనూ అమెరికా ప్రజల తరఫున నా వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిలానియా అధికారిక ఫొటోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమెరికా తొలి మహిళ అందంగా, హుందాగా ఉందని ప్రశంసించగా.. మరికొందరు విమర్శలకు దిగారు. వైట్‌హౌస్‌ కిటికీ ముందు నిలబడి ఫొటో దిగడం...స్కూల్‌లో దిగే చిత్రపటాల సెట్టింగ్‌లా ఉందని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరేమో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్త ఇంట్లో మిలానియా ఫొటో దిగారంటూ కామెంట్లు చేశారు. ఎట్ట‌కేల‌కు అధ్యక్షుడి స‌తీమ‌ణి ఇళ్లు మారాల‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ని ఇంకొంద‌రు పేర్కొన్నారు.

సాధారణంగా దేశాధ్యక్షుడు సతీమణి ఆయనతో పాటే వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో నివాసం ఉంటారు. అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికై మూడు నెలలు కావస్తున్నా.. మిలానియా మాత్రం ఇంకా మాన్‌హట్టన్‌లోని తన నివాసంలోనే ఉంటున్నారు. తన కుమారుడు బారన్‌ ఈ ఏడాది స్కూల్‌ పూర్తయ్యేవరకు మిలానియా అక్కడే ఉంటారని ట్రంప్‌ గతంలోనే ప్రకటించారు. ఐతే మిలానియా కు భద్రత కల్పించటానికి భారీగా ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/