Begin typing your search above and press return to search.
ఆ సోషల్ మీడియా స్టార్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు
By: Tupaki Desk | 24 Oct 2019 3:58 PM GMTటిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగట్‌కు నిరాశ తప్పలేదు. హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోనాలీ ఓటమి పాలయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ఈ ఎన్నికల బరిలో గెలుపొందారు. దివంగత మాజీ సీఎం భజన లాల్ కుమారుడిన పట్టం కట్టిన ఓటర్లు..సోనాలీకి ఓటమిని రుచిచూపించారు. మరోవైపు హర్యానాలో వీచిన బీజేపీ వ్యతిరేక గాలిలో సోనాలీ ఓటమి పాలయ్యారని ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు.
తన టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సోనాలీ..బీజేపీ టికెట్ పొంది అదంపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రచారంలో తన గెలుపు ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్‌ని ఎదుర్కునే క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని టిక్‌టాక్ స్టార్ ఆరోపించినప్పటికీ...ప్రజలు ఆమెకు పట్టం కట్టలేదు.ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందిన బిష్ణోయ్‌కే మరోమారు ఓట్లు వేయడంతో...సోనాలీ ఫొగట్ ఓటమి పాలైంది.
హర్యానాలో 90 సీట్లకు బీజేపీ, కాంగ్రెస్, ఐ ఎన్ ఎల్ డీ, సహా ఇటీవలే ఏర్పాటైన జననాయక్ జనతా పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో దిగారు. హర్యానాలో మళ్ళీ తమ విజయం ఖాయమని కమలనాథులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ..ఆ పార్టీ ఊహించిన ఫలితాలు రాలేదు. హర్యానాలో మరోమారు విజయం సాధిస్తామని అంచనా వేసుకున్న బీజేపీకి ప్రాంతీయ పార్టీ అయిన జేజేపీ షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ.. హర్యానాలో ఏడు ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా జాట్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం హంగ్ ఏర్పడడంతో.. బీజేపీ కూడా జేజేపీని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.