Begin typing your search above and press return to search.
ట్వీట్ చేసినా జూనియర్ ట్రోలింగే ట్రోలింగ్
By: Tupaki Desk | 22 Sep 2022 4:10 PM GMTఅదేంటో టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ ఏపీలో రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆయన గత మూడేళ్ళుగా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఏపీలో మూడేళ్ళుగా చూస్తే అధికార వైసీపీకి విపక్ష టీడీపీకి మధ్య ఉప్పు నిప్పులా ఉంది. అక్కడ ప్రతీ మాటే తూటాలా పేలుతుంది. ప్రతీ విషయమూ అగ్గిలా రాజుకుంటుంది. ఇక వైసీపీ టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తోంది.
నిన్నటిదాకా చంద్రబాబు అండ్ కో అన్నట్లుగా ఉన్న వైసీపీ పాలిటిక్స్ ఇపుడు ఏకంగా వ్యవస్థాపకుడు ఎన్టీయార్ వైపుగా మళ్ళింది. ఎన్టీయార్ పేర్నుని హెల్త్ వర్శిటీకి మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టేసి వైసీపీ పెద్దలు నింపాదిగా తమ పని తాము చేసుకుంటున్నారు ఇక గోల అంతా టీడీపీదే అవుతోంది. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలన్న దాని మీద టీడీపీ పెద్దలు కిందా మీదా అవుతున్నారు. చంద్రబాబు అయితే ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. లోకేష్ కూడా అదే దూకుడు ప్రదర్శించారు. బాబు గవర్నర్ ని కలసి వినతిపత్రం ఇచ్చి వచ్చారు.
ఒక వైపు ఎక్కడ పడితే అక్కడ ఆందోలలకు టీడీపీ పిలుపు ఇచ్చింది. మరో వైపు అన్ని విపక్షాలు కూడా మద్దతుగా ఉన్నాయి. ఇంతలా టీడీపీకి రాజకీయ అనుకూలత ఉన్నా కూడా జూనియర్ వైపు ఆ పార్టీ చూస్తోంది. మరో వైపు నెటిజన్లు కూడా మొదటి రోజు నుంచే జూనియర్ పెదవి విప్పాలని గట్టిగా కోరుకున్నారు. దానికి బదులు అన్నట్లుగా ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీయార్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు. పేరు మార్చినా కూడా తాత గౌరవం అంగుళం కూడా తగ్గదు ఎవరూ తగ్గించలేరు అని జూనియర్ గట్టిగానే చెప్పారు.
అదే టైం లో వైఎస్సార్ కూడా గొప్ప నాయకుడే అని ఆయన బ్యాలన్స్ పాటించడంతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారని ట్రోల్స్ మొదలయ్యాయి. జూనియర్ లాంటి టాప్ హీరో రియాక్షన్ ఇలా ఉంటుందా. అసలు బాలేదు అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. జూనియర్ చాలా పేలవంగా బలహీనంగా రియాక్ట్ అయ్యారంటూ ఒక వైపు టీడీపీ వారు, మరో వైపు ఎన్టీయార్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా బాణాలు వేస్తున్నారు. దీంతో పాపం జూనియర్ ఇరుక్కుపోయాడనే అంటున్నారు.
గతంలో కూడా తన సొంత మేనత్త, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద అసెంబ్లీ వేదికగా వైసీపీ వారు కామెంట్స్ చేశారని పెద్ద దుమారమే టీడీపీ నుంచి రేగింది. అపుడు కాస్తా ఆలస్యంగా వీడియో రిలీజ్ చేసిన జూనియర్ మెత్తమెత్తగా తన స్పందనను తెలియచేశారని ఏకంగా టీడీపీ నాయకులే ఆయన మీద ఫైర్ అయ్యారు. అలా ఆ వివాదం కొన్నాళ్ళ పాటు సాగింది.
ఇపుడు చూస్తే హెల్త్ వర్శిటీ వివాదం వచ్చిపడింది. జూనియర్ ఈసారి తొందరగా రియాక్ట్ అయినా కూడా ఆయన చేసిన ట్వీట్లో ప్రతీ అక్షరాన్ని శల్య పరీక్ష చేస్తూ మీదన పడుతున్నారు. ఇక జూనియర్ ట్వీట్ లో వైఎస్సార్ పేరు రావడం, ఆయన గొప్ప నాయకుడు అంటూ ఆయన చెప్పడం కూడా టీడీపీ వారికి బాధగా ఉంది అంటున్నారు. ఇలా జూనియర్ చాలా జాగ్రత్తగా ట్వీట్ చేయడమెంటి, ఆయన ట్వీట్ చేస్తే అదిరిపోవాలి, ఏకంగా వైసీపీ వారి మీద మాటల తూటాలు పేల్చాలి అన్నదే టీడీపీ వారి వాదనగా ఉందిట. మొత్తానికి జూనియర్ ది వీక్ రెస్పాన్స్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.