Begin typing your search above and press return to search.

ట్రంప్ పోయారు.. నెక్ట్స్ ఆయన ఫ్రెండ్ మోడీనే?

By:  Tupaki Desk   |   21 Jan 2021 5:04 PM GMT
ట్రంప్ పోయారు.. నెక్ట్స్ ఆయన ఫ్రెండ్ మోడీనే?
X
ఆ ఇద్దరూ దేశాధినేతలు.. రాజకీయాల కోసం మిత్రులయ్యారు. ట్రంప్ ను గెలిపించడం కోసం ‘హౌడీ మోడీ’ అంటూ భారత ప్రధాని  అమెరికాలో పర్యటించి ప్రచారం చేశాడు. ఇక మోడీ ఇమేజ్ ను పెంచేందుకు దేశంలో ‘నమస్తే ట్రంప్’ అంటూ మనదేశానికి డొనాల్డ్ ట్రంప్ వచ్చి హల్ చల్ చేశారు.

ఇద్దరి రాజకీయం ఒక్కటే.. ప్రజల్లో తమను తాము గొప్పవారిగా.. గొప్ప పరపతి గల వారిగా ఫోకస్ కావాలని.. ఓట్లు సంపాదించి మరోసారి గెలవాలని.. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకటి తలిస్తే అమెరికా ప్రజలు మాత్రం వేరొకటి తలిచారు.

అమెరికాలో నిర్వహించిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో భారత ప్రధాని మోడీ పాల్గొని ఏకంగా భారతీయులంతా ట్రంప్ కు సపోర్టు చేయాలని.. ఆయననే గెలిపించాలని పిలుపును ఇచ్చారు. అయితే మోడీ ప్రచారం చేసినా కూడా అక్కడ ట్రంప్ గెలవలేకపోయారు. ఆయన తీసుకున్న వివాదాస్పద - నిర్లక్ష్య  - జనాల వ్యతిరేక నిర్ణయాలే ఆయన కొంప ముంచాయి.

ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోగానే నెటిజన్లు  అందరూ ఆయన జిగ్రీ దోస్త్ అయిన భారత ప్రధాని నరేంద్రమోడీపై పడిపోతున్నారట.. కొందరు మోడీని ట్రంప్ తో పోలుస్తూ అప్పుడే  సోషల్ మీడియాలో‘మీమ్స్, ట్రోల్స్ ’ మొదలుపెట్టారు.

తాజాగా ‘ట్రంప్ గాన్.. మోడీ నెక్ట్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ట్రంప్ పోయాడు.. నెక్ట్స్ మోడీనే ఓడిపోతాడంటూ   ట్వీట్లు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని.. పెట్రోల్, నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని.. వచ్చే ఎన్నికల్లో మోడీకి ఓటమి తప్పదని నెటిజన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారట..

కరోనా కాలంలో అటు ట్రంప్ ఏమీ చేయలేదని.. ఇటు మోడీ 20 లక్షల కోట్లు అంటూ దేశ ప్రజల చెవిలో పూవులు పెట్టారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పనిచేయని ట్రంప్ పోగా.. ఇప్పుడు మోడీ వంతు రాబోతుందని నెటిజన్లు తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నారట.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తుతున్నట్టు సమాచారం.