Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా వాడకం అంటే.. ఇదీ!
By: Tupaki Desk | 7 May 2018 12:03 PM GMTఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలు,రోడ్ షోల సందర్భంగా ఒక పార్టీపై మరో పార్టీ బురద జల్లడం....తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం సర్వ సాధారణం. అయితే, ఆ సభలకు దాదాపుగా మెయిన్ మీడియా కవరేజ్ ఉంటుంది కాబట్టి....ఓ స్థాయి వరకే మాటల యుద్ధం జరుగుతుంది. బహిరంగ సభలు కాబట్టి....విచ్చలవిడిగా విమర్శించడం సాధ్యపడదు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రాజకీయ నేతలకు ఆ లోటు తీరిపోయింది. తమ ప్రత్యర్థి పార్టీలు, నేతలపై రాజకీయ విమర్శలు మొదలు....వ్యక్తిగత విమర్శల వరకు ఇష్టారీతిలో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించే అవకాశం దొరికింది. దీంతో, దాదాపుగా ప్రతి పార్టీ సోషల్ మీడియాలో ఈ విమర్శల కోసం ప్రత్యేకంగా ఓ వింగ్ ను ఏర్పాటు చేసి మరీ మాటల యుద్ధం చేస్తోంది. తాజాగా, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ - బీజేపీ ఐటీ వార్ రూమ్ లు ప్రచ్ఛన్న యుద్ధాన్ని తలపిస్తున్నాయి. సెకనుకు 27 మెసేజ్ లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయంటే వారి `సామాజిక`యుద్ధం ఏస్థాయిలో ఉందో చెప్పవచ్చు.
కర్ణాటకలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క మోదీ - మరో పక్క రాహుల్ బహిరంగ సభల్లో మాటల యుద్ధం చేస్తోంటే....మరోపక్క సోషల్ మీడియాలో వార్ రూమ్ లు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పై సోషల్ వార్ చేసేందుకు బీజేపీ 2 వార్ రూములను బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఐఐఎం విద్యార్థులు - లాయర్లు - జర్నలిస్టులతో ఒక్కో రూమ్ లో 30 మంది వరకూ పని చేస్తున్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో కూడా అదే తరహాలో 25 మందికి పైగా ఉన్నారు. ఆయా పార్టీ నేతలు ‘వార్’ రూం బృందానికి సూచనలు - సలహాలు ఇస్తుంటారు. తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా గంటకు లక్షకుపైగా మెసేజ్ లు - పోస్టర్లు - వీడియోలు - కార్టూన్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడమే వార్ రూమ్ సభ్యుల పని. వీరి ద్వారా దాదాపు సెకనుకు 27 మెసేజ్ లు పోస్ట్ అవుతున్నాయి. తమ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ - ట్విట్టర్ - యూట్యూబ్ లను అన్ని పార్టీలు విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి.