Begin typing your search above and press return to search.

డ్రగ్స్ దందాలో పట్టుబడ్డ సాఫ్ట్​ వేర్​ ఉద్యోగులు ..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:30 AM GMT
డ్రగ్స్ దందాలో పట్టుబడ్డ సాఫ్ట్​ వేర్​ ఉద్యోగులు ..!
X
డ్రగ్స్​ దందాలో ముగ్గురు సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు పట్టుబడ్డారు. లక్షలకు లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగులు డ్రగ్స్​కేసులో పట్టుబడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. గోవా, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్​ కొనుగోలు చేసి హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దందాలో ఇంకెంతమంది ఉన్నారు అనే విషయం విచారణలో తేలనున్నది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మౌలాలిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి (27), వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన మేకసాయి విపిన్ (27), ఘట్‌కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు చెందిన హర్షవర్ధన్ మాదాపూర్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లు ఈజీ మనీకోసం అలవాటుపడ్డారు. వీళ్లు గోవా, విశాఖపట్టణం నుంచి డ్రగ్స్​ను తెప్పించుకొని హైదరాబాద్​లో అమ్ముతున్నారు. గురువారం తార్నాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా వీళ్ల వద్ద డ్రగ్స్​ పట్టుబడింది. 150 మైక్రోగ్రాములు 56 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 12 గ్రాముల చొప్పున రెండు హషిష్ ఆయిల్ సీసాలు లభ్యమయ్యాయి.

ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను గోవా, విశాఖపట్టణం నుంచి తెప్పిస్తున్నామనీ.. ఒక్కో దానిని రూ. 2 వేలకు తీసుకొచ్చి.. ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. హర్షవర్ధన్ నుంచి హషిష్ ఆయిల్‌ ( గంజాయి ఆకులతో తయారుచేసే ఆయిల్​) ను కొనుగోలు చేసినట్టు సాయి విపిన్ ఒప్పుకున్నాడు. ఒక్కో సీసాను రూ. 2,500 వాటిని తిరిగి రూ. 4 వేలకు అమ్ముతున్నట్లుగా చెప్పాడు.