Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: పిల్ల కోసం పల్లెబాటన టెకీలు
By: Tupaki Desk | 26 April 2019 4:36 AM GMT‘‘కరీంనగర్ జిల్లా కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఇటీవలే హైదరాబాద్ లోనే మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అమ్మాయి సంబంధం ఖాయం చేశారు పెద్దలు.. కానీ అతడు ససేమిరా అని.. ఓ మారుమూల మండలంలో డిగ్రీ చదివిన అమ్మాయిని వివాహమాడాడు.’’
‘ఇక ఖమ్మం జిల్లాకు చెందిన టెకీ కూడా సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉండి.. లక్షల జీతం వచ్చినా కూడా ఆ రంగంలోని అమ్మాయిని కాకుండా తన మేనమామ కూతురునే చేసుకున్నాడు..’
ఇలా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లలో స్పష్టమైన మార్పు వచ్చింది. వారు తామ పనిచేస్తున్న రంగంలోని అమ్మాయిలను కాకుండా పక్కా పల్లెటూరి పిల్ల వైపే మొగ్గుచూపుతున్నారు. టెకీల్లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం. అసలు ఎందుకు వీళ్లంతా పల్లెబాట పడుతున్నారు..?
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటేనే కత్తిమీద సాములాంటి జాబ్. ఇక్కడ అత్యంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడితో సంసారాలు కూడా చేయని వారు ఎందరో.. తాగుడుకు బానిసై సాయంత్రాలు పార్టీలు - పబ్బులంటూ తిరుగుతూ కుటుంబ జీవితాలకు దూరమవుతుంటారు. అది కాస్తా విడాకులకు దారి తీస్తుంది. భార్య - భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయిన 80శాతం కాపురాలు కూలిపోతున్నాయంటే వారి మధ్యన అండర్ స్టాండింగ్ ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు టెకీలు మారారు.
సాఫ్ట్ వేర్ నౌకరీ చేసే అమ్మాయి వద్దు.. తమకు ఇంట్లో ఉండి వండిపెట్టే హౌస్ వైఫ్ లాంటి పిల్ల ముద్దు అంటున్నారు. పల్లెటూరి పిల్ల అయితే ఇంకా మంచిదంటున్నారు. ఎందుకంటే సిటీల్లో పెరిగిన అమ్మాయిలు కాస్త దూకుడుగా ఉంటారు. అనుకువగా ఉండరు. అర్థం చేసుకునే మనస్తత్వం తక్కువ. అదే పల్లెటూళ్లో పెరిగిన వారికి కాస్త అనుకువ - వినయం - అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అందుకే సాఫ్ట్ వేరర్లంతా ఇప్పుడు తమ కాపురాలు కలకాలం నిలబడాలంటే.. తమ సంసార సుఖం కొన్నాళ్లు సాగాలంటే పల్లెటూరి పిల్లే ముద్దు అంటున్నారట.. ఇలా పల్లెటూరి పిల్ల కోసం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు వెతుకులాడుతుండడం.. పెళ్లిళ్లు చేసుకుంటుండడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.