Begin typing your search above and press return to search.
చని పోయాక తొమ్మిది మంది ప్రాణాలు నిలబెట్టింది
By: Tupaki Desk | 4 Jan 2020 7:17 AM GMTఒక వ్యక్తి చనిపోయాక తొమ్మిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం అంటే చిన్న విషయం కాదు. ఇటీవలే అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగమ్మాయి చరితా రెడ్డి.. తన అవయవాల ద్వారా తొమ్మిది మందికి ప్రాణం పోయడం గమనార్హం. నాలుగు రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన చరితా రెడ్డి మిచిగాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడం తో చరిత తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ అయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అని తెలిశాక వైద్యులు.. తన అవయవాలు దానం చేస్తే కొన్ని ప్రాణాలు నిలబడతాయంటూ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు.
తమ బిడ్డ పోయిందన్న బాధలోనూ చరిత కుటుంబ సభ్యులు.. ఆమె అవయవాల్ని దానం చేయడానికి అంగీకరించారు. కాలేయం, గుండె కవాటాలు, కిడ్నీలు, కళ్లను వైద్యులు గిఫ్ట్ లైఫ్ హాస్పిటల్ లో ఆమె బాడీ నుంచి తీశారు. అవి తొమ్మిది మంది వేర్వేరు వ్యక్తులకు ఉపయోగపడ్డాయి. వారి ప్రాణాల్ని నిలబెట్టాయి. చరిత చనిపోయినా.. తొమ్మిది మందికి బతుకునిచ్చిన తమ బిడ్డను చూసి గర్వ పడుతున్నామంటూ ఆమె కుటుంబం పేర్కొంది. ఈ రకంగా తమ బిడ్డ ఇంకా బతికే ఉందని అన్నారు. తాను చనిపోయినా.. తొమ్మిది మందిని బతికించిన గొప్ప వనిత చరిత అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుని విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు. ఈ కుటుంబాన్ని కొనియాడుతూ ఆసుపత్రి వైద్యులు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం.