Begin typing your search above and press return to search.

సూర్యుడు కూడా లాక్ డౌన్.. భూమికి డేంజర్

By:  Tupaki Desk   |   16 May 2020 12:30 AM GMT
సూర్యుడు కూడా లాక్ డౌన్.. భూమికి డేంజర్
X
విశ్వ మానవాళికి శక్తిని అందించే సూర్యుడు కూడా పనిచేయకుండా లాక్డౌన్ లోకి వెళ్లిపోతే భూమి, మనుషులు అంతరించిపోవడం ఖాయం. సూర్యుడి ఎండ లేకపోతే మొక్కలు బతకవు. మొక్కలు లేకపోతే ఆహారం లేక మనుషులు బతకరు. అడవులు ఉండవు. వర్షాలు పడవు. మంచు యుగం వచ్చేస్తుంది. మనుషులంతా చనిపోతారు.. అవును అలాంటి స్థితినే ‘మంచు యుగం’ అంటారు. కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఇది వచ్చింది. ఇప్పుడు సూర్యుడు కూడా నిజంగానే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాడట..

అవును 930 లక్షల మైళ్ల దూరంలోని సూర్యుడి అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు, ఉపరితలానికి ఎగిసపడే జ్వాలలు, సూర్యగోళం చుట్టూ ఆవిష్యృతం అయ్యే అయస్కాంతక్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి. దీంతో భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాల వాడి తగ్గి మంచు పెరుగుతందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ప్రాణాంతక కరోనా వైరస్ కు భయపడి ప్రపంచ మానవాళి అంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయినట్టే సూర్యుడు కూడా లాక్డౌన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అగ్నిగోళం మంటలు తగ్గించిందని ‘రాయల్ అస్ట్రానమికల్ సొసైటీ’ శాస్త్రవేత్తలు తెలిపారు. 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సూర్యుడు కాస్త నెమ్మదించడం కొత్తేమీ కాదు. దీన్నే ‘సోలార్ మినిమమ్’ అంటారని తెలిపారు. సూర్యుడు కక్షలో తిరుగుతున్నప్పుడు 11 ఏళ్లకోసారి నెమ్మదిస్తాడని.. దానివల్ల భూమి మీద ప్రసరించే కిరణాల వేడి తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఈసారి కరోనా వైరస్ విజృంభణ వేళ ఆ టైం వచ్చిందని.. దానికి.. సూర్యుడు నెమ్మదించడానికి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

సూర్యుడిలో మంటలు తగ్గినప్పుడు అక్కడ నల్లటి మచ్చలు ఏర్పడడాన్ని 17వ శతాబ్ధం నుంచే రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత అవి కనిపించవు. సూర్యుడు ఇలా నెమ్మదించినప్పుడు భూమిపై భారీగా మంచు కురిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘మంచు యుగం’ కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఇలానే వచ్చిందని తెలిపారు. మంచు యుగాల సమయంలో సముద్రాలు గడ్డ కట్టడం వల్ల ఖండాలు కలిసిపోయి ప్రజలు పయనించారు. అప్పుడే మానవ నాగరికత ఒక చోట నుంచి మరో చోటకు పాకిందని శాస్త్రవేత్తలు వివరించారు.