Begin typing your search above and press return to search.
రాహుల్ పై పోటీకి సెక్స్ స్కామ్ సరిత!
By: Tupaki Desk | 4 April 2019 4:42 AM GMTకేరళ రాజకీయంలో బాగా పాపులర్ అయిన సోలార్ సరిత ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చింది. సోలార్ సరితగా పేరు పొందిన ఆమె ఏకంగా రాహుల్ మీద పోటీకి రెడీ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో తను కూడా అక్కడ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా సోలార్ సరిత ప్రకటించింది.
సోలార్ సరిత గతంలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంచలనం రేపింది. సోలార్ స్కామ్ లో ఆమె ముఖ్య పాత్రధారిగా ప్రచారం పొందింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని అనేక మంది ముఖ్యులతో సెక్సువల్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసి ఈమె ఆ స్కామ్ లో ఒక సూత్రధారిగా నిలిచింది.
దేశంలో అంత వరకూ ఎక్కడా విని ఎరగనట్టుగా నిలిచింది సోలార్ స్కామ్. చాలా స్కామ్ ల గురించి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కానీ, సోలార్ స్కామ్ మాత్రం సరిత వల్ల రసవత్తరంగా నిలిచింది. అందుకు సంబంధించిన కేసులు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి.
సోలార్ స్కామ్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాతి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. కమ్యూనిస్టు పార్టీల కూటమి అక్కడ అధికారాన్ఇన దక్కించుకుంది. ఇక సోలార్ సరిత ఇప్పుడు తెరపైకి వచ్చి మరిన్ని సంచలన ప్రకటనలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సెక్సువల్ చార్జెస్ ఎదుర్కొంటున్న నేతలను పక్కన పెట్టాలని, వారికి టికెట్లు ఇవ్వొద్దని తను రాహుల్ గాంధీకి పలుమార్లు లేఖలు రాసినట్టుగా సరిత చెబుతోంది. అయినా రాహుల్ వాళ్లకు టికెట్లు ఇచ్చారని, అందుకే రాహుల్ ను ఓడించడమే లక్ష్యంగా తను పోటీకి దిగుతున్నట్టుగా సోలార్ సరిత ప్రకటించింది! మొత్తానికి రాహుల్ కు ఇలాంటి ప్రత్యర్థులు కూడా ఎదురవుతున్నట్టుగా ఉన్నారు!