Begin typing your search above and press return to search.
అరంగేట్రంలోనే అద్భుతం ... దానికోసం ఎన్నో అమ్ముకొని, దేశాన్ని వీడాడు !
By: Tupaki Desk | 6 Jun 2021 12:30 AM GMTఏదైనా సాధించిన తర్వాతనే మనల్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఇది సర్వసాధారణం. ఆటలోనైనా , వ్యాపారంలో అయినా , అలాగే ఏ రంగంలోనైనా విజయం సాధించిన తర్వాతే మనకి గుర్తింపు దక్కుతుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో న్యూజిలాండ్ నయా డైనమైట్ డెవాన్ కాన్వే ఓ సూపర్ హీరో. మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన ద్విశతకాన్ని సాధించి హీరోగా మారిపోయాడు. అయితే, అతడి జీవితం సాఫీగా సాగలేదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే, ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా ,తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్ బాట పట్టాడు.
2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే, అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్ బై చెప్పాడు. అక్కడి నుంచి స్నేహితుల సహకారంతో వెల్లింగ్టన్‌కు చేరిన కాన్వే, అక్కడే తన క్రికెట్ కెరీర్ ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్ గా, బ్యాట్స్ మెన్ గా డ్యుయల్ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కాన్వే, ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన అతను, అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్ మక్కాలో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన కాన్వే, 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కాన్వే, గురువారం రెండో రోజు ఆటలో 125 ఏళ్ల మరో అరుదైన ఘనతను అధిగమించాడు. ఇక, కాన్వే తన బ్యాటింగ్ స్టైల్ తో ఇంగ్లాండ్ క్రికెటర్లకు చుక్కలు చూపించాడు. ఎంతో శ్రమించినా డెవాన్ కన్వే వికెట్ తీయలేకపోయారు ఇంగ్లండ్ బౌలర్లు. సరిగ్గా 200 పరుగులు చేసిన తరువాత, డెవాన్ రనౌట్ అయ్యాడే తప్ప, ఇంగ్లాండ్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. జట్టు మొత్తం చేసిన పరుగుల్లో 50 శాతానికి పైగా రన్స్, అతనొక్కడే చేశాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్ ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు (4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు (సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్ లో 200 పరుగులు సాధించాడు.