Begin typing your search above and press return to search.
కదన రంగంలోనే సైనికుల పెళ్లి..!
By: Tupaki Desk | 8 March 2022 4:28 AM GMTఉక్రెయిన్ లో మారణహోమం ఇంకా కొనసాగుతుంది. దేశంలో చాలా నగరాలను రష్యా ఆక్రమించుకుంది. ఉక్రెయిన్ సైనికులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నా సరే.. ఆక్రణలు ఆగడం లేదు. బాంబు, క్షిపణి దాడులతో ప్రజలే లక్ష్యంగా రష్యా దురాక్రమణకు పాల్పడుతుంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో దిగజారుతున్న పరిస్థితులను కళ్లక కట్టేలా చాలా వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఓ చిన్నారి రష్యా సైనికులను దేశం దాటి వెళ్లాలని కోపంగా చెప్తుండడం, అలాగే ఓ వ్యక్తి యుద్ధ ట్యాంకర్ను అడ్డుకోవడం లాంటి దృశ్యాలు చాలానే చూశాము. ఇయితే తాజా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇద్దరు సైనికులు కదన రంగంలోనే పెళ్లి చేసుకోవడం.. వారికి తోటి సైనికులు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు వెనుక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఉక్రెయిన్ పై పుతిన్ ప్రకటించిన సైనిక చర్య ఇప్పటికే 12 రోజులకు చేరింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న పౌరులను ఇతర దేశాలకు పంపేందుకు రష్యా సైన్యం యుద్ధానికి కొద్ది సేపు విరామాన్ని ప్రకిటించింది.
దీంతో అక్కడ ఉండే ఉక్రెయిన్ లు వలస బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సైనిక దుస్తులు మీదనే పెళ్లి చేసుకుంటున్నట్లు ఆ వీడియో ఉంది. అయితే ఈ సైనికులు పెళ్లికి పెద్దలుగా పక్కన ఉన్న సహ సైనికులు హాజరయ్యారు. వారిలో ఒకరు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే కొందరు వారికి బొకేలు అందచేస్తున్నారు.
కదన రంగంలోనే జరిగిన వీరి వివాహం ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఉక్రెయిన్ రాజధాని నగరం అయిన కీవ్ లో ఉండే ప్రత్యేక బలగాల్లో వీరు పని చేస్తున్నట్లు వారు తెలిపారు. వీరి పేర్లు లెస్యా, వలెరీ అని పేర్కొన్నారు. ఈ ఉక్రెయిన్ యుద్ధ జంటకు పక్కనున్న సైనికులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ ఉక్రెయిన్ సైనికులకు సంబంధించిన ప్రేమ వివాహానికి సంబంధించి వీడియోను జర్మన్ న్యూస్ అవుట్లెట్ అయిన బ్లిడ్ కు చెందిన ఓ రిపోర్టర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే వీరు గత ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని సమాచారం. అయితే యుద్ధ సమయంలో ప్రాణాలతో ఉంటామే లేదో తెలియక ఇలా చేస్తున్నట్లు చెప్తున్నారు.