Begin typing your search above and press return to search.
అమెరికాలో మోదీకి ఘన స్వాగతం ... షెడ్యూల్ ఇదే
By: Tupaki Desk | 23 Sep 2021 7:36 AM GMTమూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీ కు ఘన స్వాగతం లభించింది. త్రివర్ణ పతాకాలు చేబూనిన ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సమావేశం, క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌తోనూ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇంకా, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రస్తుత పరిణామాలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చిస్తారు. పర్యటన ముగించుకుని ఈ నెల 26న తిరిగి స్వదేశానికి వస్తారు.
కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ బుధవారం ఎయిర్ ఇండియా వన్ విమానంలో అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సహా పలువురు ఉన్నతాధికారులు ఆయన వెంట వెళ్లారు. అమెరికా బయలుదేరే ముందు తన పర్యటన గురించి వివరాలను వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకే అక్కడికి వెళుతున్నానని, ఇండియా, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి బైడెన్ తో చర్చిస్తానని చెప్పారు. సెప్టెంబరు 22–25 వరకు అమెరికా పర్యటన కొనసాగుతుంది.
ఈ పర్యటనలో జో బైడెన్ తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్ సదస్సులోనూ పాల్గొంటాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యాచరణ, ప్రాధాన్యాలను గుర్తించడానికి సదస్సు దోహదపడుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వాషింగ్టన్ డిసిలో స్వాగతం పలికిన భారతీయ సమాజానికి కృతజ్ఞతలు. మన ప్రవాసులు మన బలం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 23న అమెరికాలోని వాషింగ్టన్ లో మేజర్ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. క్వాల్ కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, ఆటమిక్స్, బ్లాక్ స్టోన్ కంపెనీల సీఈవోలతో చర్చిస్తారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌస్ లో చర్చలు జరుపుతారు. అప్ఘానిస్తాన్ పరిణామాలు, ఉగ్రవాదం, చైనా ఆధిపత్యం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తోనూ భేటీ అవుతారు ప్రధాని మోదీ.
అదే రోజు జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా సమావేశమవుతారు. అనంతరం అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలతో కూడి న క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ న్యూయార్క్ బయల్దేరి వెళతారు.
సెప్టెంబరు 25న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే రోజు భారత్ కు తిరుగు ప్రయాణమవుతారు. సెప్టెంబర్ 26న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు.