Begin typing your search above and press return to search.
అమెరికాకు ఆ చిన్న దేశం షాక్ మామాలుగా లేదుగా!
By: Tupaki Desk | 1 Sep 2022 4:47 AM GMTప్రపంచానికే పెద్దన్నగా అమెరికా తనను తాను భావిస్తూ ఉంటోంది. ప్రపంచంలోనే ఏకైక అగ్రరాజ్యంగా అన్ని దేశాలు తాను గీసిన గీటును దాటు కూడదని అది అనుకుంటూ ఉంటుంది. అలాంటి అమెరికాకు తాజాగా ఒక అతి చిన్న దేశం షాక్ ఇచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన సోలమన్ ఐలాండ్స్ అమెరికాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి.
తమ తీర ప్రాంత జలాల్లోకి అమెరికా నౌకలు వచ్చేందుకు సోలమన్ ఐలాండ్స్ నో చెప్పింది. ఇటీవల చైనా.. ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా తమ ఓడలు, విమానాలు ఆగడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా నౌకలు ఆగడానికి సోలమన్ ఐలాండ్స్ ఒప్పుకోకపోవడం గమనార్హం. ఈ సోలమన్ ఐలాండ్స్ దేశం.. ఆస్ట్రేలియాకు అతి దగ్గరలో ఉంది. దక్షిణ చైనా సముద్రం వివాదంలో ఆస్ట్రేలియాతో చైనాకు గొడవలు ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా, జపాన్, భారత్, అమెరికా.. క్వాడ్ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. తమ కూటమికి ఎవరికీ వ్యతిరేకం కాదని ఈ నాలుగు దేశాలు చెబుతున్నా.. వాటి లక్ష్యం అమెరికానే అని నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తమ శత్రు దేశాల్లో ఒకటిగా ఆస్ట్రేలియాను భావిస్తున్న చైనా.. సోలమన్ ఐలాండ్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టి ఆ దేశ నాయకత్వాన్ని తన వలలో వేసుకుంది. తద్వారా సోలమన్ ఐలాండ్స్ లో తన యుద్ధ నౌకలు, విమానాలను దింపి యుద్ధం వస్తే సమీపంలోనే ఉన్న ఆస్ట్రేలియా భరతం పట్టాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా చెప్పినట్టుల్లా ఆడుతున్న సోలమన్ ఐలాండ్స్.. అమెరికా నౌకలు ఆయిల్ ఎక్కించుకోవడానికి కూడా అనుమతి నిరాకరించింది.
ఒక్క అమెరికానే కాకుండా విదేశాలకు చెందిన మిలిటరీ నౌకలు తమ దేశ నౌకాశ్రయాల్లోకి రావటంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు సోలమన్ ఐలాండ్స్ దేశ ప్రభుత్వం చెబుతోంది. ఈ తాత్కాలిక నిషేధం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సోలమన్ ఐలాండ్స్ దేశంలోని నౌకాశ్రయంలో ఇంధనం నింపుకోవాలని భావించిన అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌కు అనుమతి లభించలేదు. అయితే ఈ నిషేధంపై అమెరికా, ఆస్ట్రేలియా సహా దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు సోలమన్ ఐలాండ్స్ వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. చైనా ఒత్తిడితోనే తమ నౌకలకు ఆ దేశం అనుమతి నిరాకరించిందని అనుమానిస్తున్నాయి.
మరోవైపు.. విదేశీ నౌకలకు తమ తీర జలాల్లో అనుమతి లేదన్న సోలమన్ ఐంలాడ్స్ తమ మిత్ర దేశం చైనాకు మరింత దగ్గరవుతోంది. 2022 ఏప్రిల్‌లో ఇరు దేశాలు భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా సహా విదేశీ మిలిటరీ నౌకలపై సోలమన్ ఐలాండ్స్ తాత్కాలిక నిషేధం విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.