Begin typing your search above and press return to search.
భూ సమస్యలకు పరిష్కారం ఇదేనా..?
By: Tupaki Desk | 7 Oct 2021 5:28 AM GMTఒకరికి సంబంధించి భూములు మరికొరికి వెళ్లడం..నిషేధిత భూముల్లో పట్టాలు రావడం.. ఎప్పుడో విక్రయించి భూములు వారి పేరిటే నమోదు కావడం, తదితర భూ సమస్యలతో తెలంగాణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే భూ సమస్యలకు పరిష్కార వేదిక ఒక్కటేనని ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇందులో నమోదైన వివరాలన్నీ తప్పుల తడకగా సూచిస్తున్నాయి. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే ధరణి వెబ్ సైట్లో అప్లోడ్ చేశారని, చాలా వరకు అవి తప్పులుగానే నమోదయ్యయని ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కొందరు ధరణి అధారంగా చేసుకొని విక్రయించిన భూములు తమవేనని ఆందోళన చేస్తున్నార. మరోవైపు నిషేధిత భూముల్లో పట్టాలు రావడంతో ఆ భూములుపై పట్టు పెంచుకుంటున్నారు.
భూ సమస్యలు పరిష్కారం కోసం ధరణి వెబ్ సైట్ పరిష్కారమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇందులో అనేక తప్పులు నమోదు కావడంతో ఇప్పడు ఇదే సమస్యగా మారింది. ఇందుకు ప్రతి రోజు కలెక్టర్ల ఆపీసులకు వస్తున్న ఫిర్యాదులే కారణం. ప్రతి రోజు ఎమ్మార్వో కార్యాలయానికి భూ సమస్యపై ఒక ఫిర్యాదు అందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి పెట్టాలని భూ చట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డులో లోపాలు ఉంటే మాన్యువల్ రికార్డులను ఆధారం చేసుకోవాలని అంటున్నారు.
2004 నుంచి భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలైంది. అయినా ఇప్పటికీ భూ సమస్యలు తీరడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన భూ సర్వే లో కొందరు తమకు అందుబాటులో ఉన్న ఆధారాలతోనే వివరాలను నమోదు చేశారు. అంతకుముందున్న గ్రామ పహాణీలను వారు పట్టించుకోలేదు. వెబ్ ల్యాండ్, భూ రికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్ ఆధారంగానే వారు ధరణిలో వివరాలను నమోదు చేశారు. దీంతో గ్రామ పహాణి ప్రకారం చూస్తే ఆ వివరాలకు పొంతన లేదు. దీంతో సమస్యలు తీరడం లేదు.
అయితే ఈ సమస్య పరిష్కారానికి మరోసారి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు భూ సమస్య పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లకోసారి భూ సవరణ రికార్డులను ప్రక్షాళన చేయాలని అంటున్నారు. మాన్యువల్ రికార్డులను క్షేత్రస్థాయి రికార్డులతో పోల్చి చూసి ఆ తరువాతే వివరాలు పక్కాగా నమోదు చేయాలి. అయితే ఇందుకు భూ సర్వేనే పరిష్కారమంటున్నారు.
ప్రస్తుతం ధరణి వ్యవస్థ ప్రకారం భూ సంబంధిత ఫిర్యాదులను కలెక్టర్లే పరిష్కరించాలి. అయితే కలెక్టర్లు ఒక్క నిషేధిత భూముల విషయంలో మాత్రమే టైటిళ్లు ఇచ్చేందుకు చట్టబద్ధత ఉందని భూ రికార్డుల నిపుణులు అంటున్నారు. భూ రికార్డలు చట్టంలోనే కలెక్టర్లకు అధికారం లేనప్పుడు వారెలా ఈ సమస్యలు పరిష్కరిస్తారని అంటున్నారు. అంతకుముందు మ్యుటేషన్ పై తహసీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణకు ఆర్డీవోకు మాత్రమే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు ఈ అధికారాన్ని తహసీల్దార్లకు మాత్రమే అప్పగించారు. ఇలాంటి సమయంలో కలెక్టర్లు సమస్య పరిష్కారం కోసం చొరవ చూపినా అది పనిచేయదని అంటున్నారు.
2007లో భూ రికార్డుల ప్రక్షాళన పేరిట 100 రోజుల ప్రణాళిక చేపట్టారు. మరోసారి ఇలాంటి ప్రణాళికతో సమస్య కొంత వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కొందరు భూ రికార్డుల నిపుణులు అంటున్నారు. అలాగే గ్రామాల్లోని పహాణిని ఆమోదం పొంది దానిని రికార్డుగా ఏర్పరచాలి..భూ వివాదానికి డివిజినల్, జిల్లా స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయాలి.. జిల్లా స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాలి. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసులు సివిల్ కోర్టులకు మాత్రమే పంపే ప్రయత్నం చేయాలని భూ రికార్డుల నిపుణులు సూచిస్తున్నారు.